భారత సైన్యానికి 35,000 ఏకే-203 రైఫిళ్లను డెలివరీ చేసిన ఇండో-రష్యన్ జాయింట్ వెంచర్

కలాష్నికోవ్ ఏకే-203 అసాల్ట్ రైఫిల్స్ ఇదివరకే ఉన్న ఏకే-200 సిరీస్‌కు ఆధునిక వెర్షన్

Update: 2024-07-05 10:45 GMT

దిశ, నేషనల్ బ్యూరో: 22వ భారత్‌- రష్యా వార్షిక శిఖరాగ్ర సమావేశానికి ముందు భారత్-రష్యా జాయింట్ వెంచర్ అయిన ఇండో-రష్యన్ రైఫిల్స్ ప్రైవేట్ లిమిటెడ్ (ఐఆర్ఆర్‌పీఎల్) 35,000 'మేడ్ ఇన్ ఇండియా' కలాష్నికోవ్ ఏకే-203 అసాల్ట్ రైఫిల్స్‌ను తయారు చేసి భారత సైన్యానికి అందజేసినట్లు ప్రకటించింది. రక్షణ రంగంలో భారత 'మేక్ ఇన్ ఇండియా', ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ లక్ష్యంలో భాంగా ఇరు దేశాల మధ్య కొనసాగుతున్న విస్తృత రక్షణ సహకారంలో ఈ బదిలీ జరిగింది. కలాష్నికోవ్ ఏకే-203 అసాల్ట్ రైఫిల్స్ ఇదివరకే ఉన్న ఏకే-200 సిరీస్‌కు ఆధునిక వెర్షన్. దీన్ని ఇండియన్ ఆర్మీలో ఉపయోగిస్తారు. వీటిని ఉత్తరప్రదేశ్‌లోని అమేఠీలో ఉన్న ఫ్యాక్టరీలో తయారు చేయగా, భారత్-రష్యా మధ్య ఒప్పందంలో భాగంగా దేశీయంగా వీటి ఉత్పత్తి రష్యన్ టెక్నాలజీ సహకారంతో జరుగుతుంది. ఈ ఫ్యాక్టరీలో 6.70 లక్షల రైఫిళ్ల తయారీకి ఐఆర్ఆర్‌పీఎల్ ఆర్డర్ కలిగి ఉంది. వీటి నిర్వహణ సులభంగా, అధిక నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా ఉంటుంది. అరుదైన సందర్భాల్లో ఆశించిన స్థాయిలో పనిచేస్తాయి. 


Similar News