యూఏఈ వెళ్లేవారికి ఇండియన్ ఎంబసీ అడ్వైజరీ..!

యూఏఈలోని భారత రాయబార కార్యాలయం భారత పౌరులకు కీలక సూచనలు చేసింది. దుబాయ్ ప్రయాణాలు రీషెడ్యూలే చేసుకోవాలని అడ్వైజరీ జారీ చేసింది.

Update: 2024-04-19 10:34 GMT

దిశ, నేషనల్ బ్యూరో: యూఏఈలోని భారత రాయబార కార్యాలయం భారత పౌరులకు కీలక సూచనలు చేసింది. దుబాయ్ ప్రయాణాలు రీషెడ్యూలే చేసుకోవాలని అడ్వైజరీ జారీ చేసింది. దుబాయ్ కి వచ్చేవారు ప్రయాణాలను రద్దు చేసుకోవాలని కోరింది. దుబాయ్ నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లేవారు.. సాధారణ ప్రయాణాలు రీ షెడ్యూల్ చేసుకోవాలని సూచించింది. దుబాయ్ ని వరదలు ముంచెత్తాయి. అక్కడి జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. దీంతో కార్యకలాపాలన్నీ సాధారణ స్థితికి వచ్చేవరకు ఈ సూచనలు పాటించాలని కోరింది ఇండియన్ ఎంబసీ.

దుబాయ్‌ సహా సమీప ప్రాంతాలను వరదలు ముంచెత్తాయి. అనూహ్య వాతావరణ పరిస్థితుల వల్ల దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో కార్యకలాపాలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. ఇప్పటికే ఇన్ బౌండ్ విమానాల సంఖ్యను తగ్గించింది. పరిస్థితులను అదుపులోకి తెచ్చేందుకు యూఏఈ అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఎయిర్ లైన్స్ నుంచి కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాతే ప్రయాణికులు ఎయిర్ పోర్టుకు వెళ్లాలని పేర్కొంది ఇండియన్ ఎంబసీ.

దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో హెల్ప్ లైన్ ను ఏర్పాటు చేసింది ఇండియన్ ఎంబసీ. భారత పౌరుల కోసం హెల్ప్ లైన్ అందుబాటులో ఉందని పేర్కొంది. మరో 24 గంటలు పోతే కానీ.. దుబాయ్ ఎయిర్ పోర్టులో పరిస్థితిలు సాధారణ స్థితికి వస్తాయని అంచనా వేశారు అధికారులు.


Similar News