బీజేపీ పాలన అంతంతోనే అవినీతి రహిత భారత్ : కేజ్రీవాల్

Update: 2023-03-29 16:33 GMT

న్యూఢిల్లీ: సీబీఐ, ఈడీ తమ దాడులతో అవినీతిపరులనంతా ఒకే పార్టీలోకి తీసుకొచ్చారని మారారని.. బీజేపీ పాలన అంతంతోనే అవినీతి రహిత భారత్ ఏర్పడుతుందని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ఢిల్లీ అసెంబ్లీలో తనపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై ఆయన మాట్లాడారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని తుంగలో తొక్కే ఏ అవకాశాన్నీ బీజేపీ వదులుకోదని కేజ్రీవాల్ ఆరోపించారు. అవినీతిపరులనందరినీ ఈడీ, సీబీఐ ఒక పార్టీలోకి తీసుకొచ్చాయని ఆయన చెప్పారు.

‘దొంగలందరు, లూటీలు చేసేవారు, అవినీతిపరులు ఒక పార్టీలో ఉన్నారు. బీజేపీ ప్రభుత్వం అంతమైపోయి వారంతా జైలుకు వెళితే దేశం అవినీతి రహితం అవుతుంది’ అని కేజ్రీవాల్ అన్నారు. తమ ఎమ్మెల్యేను ఈడీ, సీబీఐల ద్వారా భయపెట్టాలని చూశారని.. రూ. 25 కోట్లు లంచం ఇవ్వజూపారని.. కానీ అవేవీ పనిచేయలేదని ఢిల్లీ ముఖ్యమంత్రి వెల్లడించారు. ‘మీలో ప్రతి ఒక్కరూ రత్నమే. భయపడకండి. ఒకవేళ మీరు జైలుకు వెళితే మీ కుటుంబాల సంరక్షణ బాధ్యత నేను తీసుకుంటాను. ఢిల్లీ అసెంబ్లీలో జరుగుతున్న సంఘటనలు ప్రజాస్వామ్యానికి సానుకూల సందేశాలను అందజేస్తాయి’ అని ఆయన చెప్పారు. బీజేపీ పాలిత కేంద్రం ప్రతిపక్ష పార్టీ ప్రభుత్వాలను పనిచేసుకోనివ్వడం లేదని కేజ్రీవాల్ ఆరోపించారు.

Tags:    

Similar News