రెండు మూడేళ్లలో భారత్‌లోకి పాక్ ఆక్రమిత కశ్మీర్: మంత్రి సంచలన వ్యాఖ్యలు

హర్యానా మంత్రి కమల్ గుప్తా సంచలన వ్యాఖ్యలు చేశారు. రెండు మూడేళ్లలో భారత్‌లోకి పీవోకే తిరిగి వస్తుందని అన్నారు

Update: 2023-03-06 17:06 GMT

పానిపట్: హర్యానా మంత్రి కమల్ గుప్తా సంచలన వ్యాఖ్యలు చేశారు. రెండు మూడేళ్లలో భారత్‌లోకి పీవోకే తిరిగి వస్తుందని అన్నారు. ప్రధాని మోడీ నాయకత్వంలోనే ఇది సాధ్యమైతుందని చెప్పారు. సోమవారం రోహ్‌తక్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ‘మేము రామ మందిర నిర్మాణానికి మార్గం సుగమం చేశాము. ఆర్టికల్ 370ని తొలగించాం. పాక్ ఆధీనంలోని ముజఫర్‌బాద్‌తో పాటు ఇతర ప్రాంతాలను భారత్‌లో కలపాలని నిరసనలు జరుగుతున్నాయి’ అని అన్నారు.

పీవోకేలోని భూభాగాన్ని పాకిస్తాన్ ఆక్రమించుకుందని చెప్పారు. రాబోయే రెండు-మూడేళ్లలో ఏ క్షణంలోనైనా తాము దానిని స్వాధీనం చేసుకోవచ్చని ఉద్ఘాటించారు. 2014 కు ముందు భారత్ ధృడంగా లేదని, ప్రస్తుతం పటిష్టంగా ఉందని చెప్పారు. భారత్‌ను ఏకం చేస్తామని చెబుతూనే ముక్కలు చేస్తున్నారని విపక్షాలపై విరుచుకుపడ్డారు. దేశాన్ని విశ్వగురుగా మార్చే సత్తా కేవలం బీజేపీకే ఉందని నొక్కి చెప్పారు.

Tags:    

Similar News