రక్షణ పరికరాల ఉత్పత్తిలో దూసుకుపోతున్న భారత్: రాజ్‌నాథ్ సింగ్

మేక్ ఇన్ ఇండియా చొరవ కింద భారత్ రక్షణ ఉత్పత్తుల్లో భారీ వృద్ధిని సాధించిందని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ శుక్రవారం అన్నారు

Update: 2024-07-05 08:12 GMT

దిశ, నేషనల్ బ్యూరో: మేక్ ఇన్ ఇండియా చొరవ కింద భారత్ రక్షణ పరికరాల ఉత్పత్తుల్లో భారీ వృద్ధిని సాధించిందని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ శుక్రవారం అన్నారు. 2023-24లో రక్షణ ఉత్పత్తి విలువలో భారతదేశం అత్యధిక వృద్ధిని నమోదు చేసిందని ఎక్స్‌లో తెలిపారు. 2022-2023 ఆర్థిక సంవత్సరం నుంచి ఉత్పత్తి విలువ 16.8 శాతం పెరిగి 2023-2024లో రూ.1,26,887 కోట్లకు చేరుకుందని రక్షణ మంత్రి అన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు కంపెనీలకు అభినందనలు. భారతదేశాన్ని ప్రముఖ గ్లోబల్ డిఫెన్స్ మాన్యుఫ్యాక్చరింగ్ హబ్‌గా అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం మరింత అనుకూలమైన పాలనను రూపొందించడానికి కట్టుబడి ఉందని ఎక్స్‌లో పేర్కొన్నారు.

ఈ వృద్ధిని సాధించడానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో మేక్ ఇన్ ఇండియా చొరవ బాగా ఉపయోగపడింది. రానున్న రోజుల్లో రక్షణ ఉత్పత్తిలో భారత్ మరింత బలమైన వృద్ధిని సాధిస్తుందని, ఇది ప్రతి సంవత్సరం సరికొత్త మైలురాళ్లను దాటుతుందని రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. రక్షణ పరికరాల కోసం విదేశాలపై ఆధారపడటాన్ని చాలా వరకు తగ్గించడానికి కేంద్రం, మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమాలను ప్రోత్సహిస్తుంది. స్వదేశీ రక్షణ పరికరాలను అభివృద్ధి చేయడంలో ఇవి కీలకంగా ఉన్నాయి.


Similar News