Ukraine crisis: భారత్- చైనా కీలక పాత్ర పోషిస్తాయి.. ఉక్రెయిన్ వివాదంపై ఇటలీ ప్రధాని కీలక వ్యాఖ్యలు

రష్యా- ఉక్రెయిన్‌ వివాదంపై ఇటలీ ప్రధాని జార్జియా మెలోనితో కీలక వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్ లో శాంతి స్థాపనకు భారత్ తో సహా పలు దేశాలు మద్దతు ఇస్తాయన్నారు.

Update: 2024-09-08 05:04 GMT

దిశ, నేషనల్ బ్యూరో: రష్యా- ఉక్రెయిన్‌ వివాదంపై ఇటలీ ప్రధాని జార్జియా మెలోనితో కీలక వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్ లో శాంతి స్థాపనకు భారత్ తో సహా పలు దేశాలు మద్దతు ఇస్తాయన్నారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్ స్కీ ఇటలీ పర్యటనలో భాగంగా ప్రధాని జార్జియా మెలోనితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగానే రష్యా- ఉక్రెయిన్ యుద్ధం గురించి ప్రస్తావనకు వచ్చింది. ఇరుదేశాల మధ్య వివాదాన్ని పరిష్కరించేందుకు భారత్, చైనా కీలక పాత్ర పోషిస్తాయని జార్జియా మెలోనితో అన్నారు. ఉక్రెయిన్‌ వివాద పరిష్కారానికి ఇటలీ మద్దతు ఉంటుందని ప్రకటించారు. కైవ్‌కు మద్దతు ఇచ్చే నిర్ణయం ఇటలీ జాతీయ ప్రయోజనాలకు అనుగుణంగా ఉందన్నారు. ఆ నిర్ణయం ఎప్పటికీ మారదని చెప్పారు.

జార్జియా మెలోనితో ఏమన్నారంటే?

ఉక్రెయిన్‌లో శాంతిస్థాపనకు తన ప్రభుత్వం పూర్తి మద్దతు ఇస్తుందని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనితో గుర్తుచేశారు. అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘిస్తే గందరగోళ పరిస్థితులు ఏర్పడతాయన్నారు. కాగా.. ఉక్రెయిన్ – రష్యా వివాద పరిష్కారంలో భారత్‌, చైనాలు కీలక పాత్ర పోషిస్తాయని తాను నమ్ముతున్నట్లు పేర్కొన్నారు. రష్యా- ఉక్రెయిన్‌ల మధ్య శాంతి స్థాపనకు భారత్‌తో పాటు చైనా, బ్రెజిల్‌ దేశాలు మధ్యవర్తిత్వం వహించగలవని రష్యా అధ్యక్షుడు పుతిన్‌ ఇటీవలే పేర్కొన్నారు. ఆ తర్వాత, ఇటలీ ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు.


Similar News