దేశ రాజధాని ఢిల్లీలో ప్రమాదకర పరిస్థితి (వీడియో)
దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం భారీగా పెరుగుతోంది. పరిస్థితి ఇలాగే దిగజారితే తీవ్రమైన శ్వాసకోశ సమస్యలు తప్పవని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీంతో అక్కడి ప్రభుత్వం అలర్ట్ అయ్యింది.
దిశ, డైనమిక్ బ్యూరో: దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం భారీగా పెరుగుతోంది. పరిస్థితి ఇలాగే దిగజారితే తీవ్రమైన శ్వాసకోశ సమస్యలు తప్పవని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీంతో అక్కడి ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. సాధారణంగా ఏటా దీపావళి తర్వాత ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలో కాలుష్యం పెరుగుతుంది. ఆదివారం గాలి నాణ్యత సూచి (ఏక్యూఐ) భారీగా పడిపోయి 266 వద్ద నమోదైంది. తాజాగా ఇవాళ సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (సీపీసీబీ) డేటా ప్రకారం జహంగీర్‌పురి ప్రాంతంలో (ఏక్యూఐ) గరిష్టంగా 349కి చేరుకుంది.
దీంతో రాను రాను కాలుష్యం తారాస్థాయికి చేరే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. పొల్యూషన్ 400 వందలు దాటితే గాలి నాణ్యత పూర్తిగా తగ్గుతుందని నిపుణులు తెలిపారు. దీంతో అప్రమత్తమైన ఢిల్లీ పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్, కేంద్ర ప్రభుత్వ కాలుష్య నియంత్రణ లో భాగంగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే కాలుష్యాన్ని నియంత్రించే పనిలో పడ్డారు.
#WATCH | Overall air quality in Delhi deteriorates to 'Very Poor' category with the latest AQI at 309.
— ANI (@ANI) October 23, 2023
Visuals around Anand Vihar, Hasanpur Depot, National Highway 9. pic.twitter.com/9H1SQwrib7