అసెంబ్లీ ఉపఎన్నికల్లో బీజేపీ హవా..25 స్థానాలకు 11 చోట్ల గెలుపు

లోక్ సభ ఎన్నికలతో పాటు పలు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఉప ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటింది. 25 నియోజకవర్గాలకు గాను 12 చోట్ల గెలుపొందగా..ఏడు స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధించింది.

Update: 2024-06-04 13:28 GMT

దిశ, నేషనల్ బ్యూరో: లోక్ సభ ఎన్నికలతో పాటు పలు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఉప ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటింది. 25 నియోజకవర్గాలకు గాను 12 చోట్ల గెలుపొందగా..ఏడు స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. గుజరాత్‌లో ఐదు స్థానాలకు ఎన్నికలు జరగగా..అన్ని చోట్ల బీజేపీ గెలుపొందింది. అలాగే హర్యానాలోని కర్నల్, తమిళనాడులోని విలవంకోడ్, త్రిపురలోని రాం నగర్ సెగ్మెంట్లలో కాషాయ పార్టీ గెలుపొందింది. యూపీలోని నాలుగు స్థానాలకు ఎన్నికలు జరగగా.. దాద్రౌల్, లక్నో ఈస్ట్‌లో బీజేపీ, గైన్సారీ, దుద్ది నియెజకవర్గాల్లో సమాజ్ వాదీ పార్టీ అభ్యర్థులు గెలుపొందారు. అలాగే బిహార్‌లోని అజియోన్‌లో సీపీఎం, జార్ఖండ్‌లోని గాండేలో జార్ఖండ్ ముక్తి మోర్చా తరపున బరిలోకి దిగిన మాజీ సీఎం హేమంత్ సొరేన్ భార్య కల్పనా సొరేన్, రాజస్థాన్‌లోని బాగిదోరలో భారత్ ఆదీవాసీ పార్టీ, పశ్చిమ బెంగాల్‌లోని భగభంగోలా, బరానగర్ స్థానాల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపొందారు. ఇక, తెలంగాణలోకి కంటోన్మెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి విజయం సాధించారు.

హిమాచల్ ప్రభుత్వం సేఫ్

లోక్‌సభ ఎన్నికల్లో హిమాచల్‌లో కాంగ్రెస్‌ ఘోర పరాజయాన్ని చవిచూసింది. కానీ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో 6 స్థానాలకు 4 సీట్లు గెలుచుకుని ప్రభుత్వాన్ని కాపాడుకోగలిగింది. దీంతో రాజ్యసభ ఎన్నికల నుంచి రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ సంక్షోభానికి తెరపడింది. హిమాచల్ అసెంబ్లీలో కాంగ్రెస్ ఎమ్మెల్యేల సంఖ్య ప్రస్తుతం34 నుంచి 38కి పెరిగింది, ఇది ప్రస్తుత అసెంబ్లీలోని 65 మంది ఎమ్మెల్యేల మెజారిటీ కంటే 5 ఎక్కువ. జూన్ 4న రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించిన బీజేపీకి షాక్ తగిలినట్టు అయింది.


Similar News