10 రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. హై అలర్ట్ ప్రకటించిన వాతావరణ శాఖ

ఉత్తరాది, ఈశాన్య రాష్ట్రాలను గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి.

Update: 2024-08-07 10:05 GMT

దిశ, వెబ్ డెస్క్:  ఉత్తరాది, ఈశాన్య రాష్ట్రాలను గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. రానున్న మరో రెండు రోజులపాటు 10 రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురవనున్నట్టు వాతావరణశాఖ హెచ్చరించింది. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మిజోరాం, త్రిపుర, అసోం, మేఘాలయ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురవనున్నట్టు ప్రకటించింది. ఈ క్రమంలో ఆయా రాష్ట్రాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ముఖ్యంగా హిమాచల్ రాష్ట్రంలోని పది జిల్లాల్లో అతిభారీ వర్షాలు కురవనున్నట్టు ఐఎండీ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. రాబోయే 24 గంటల్లో ఆకస్మిక వరదలు సంభవించే అవకాశాలు ఉన్నట్టు ప్రకటించిన వాతావరణ శాఖ, ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచించింది. బుధ, గురు వారాల్లో బిలాస్ పూర్, చంబా, కాంగ్రా, కులు, సిమ్లా, సోలన్ ప్రాంతాల్లో ఈ అతి భారీ వర్షాలు సంభవిస్తాయని తెలిపింది. కొండచరియలు విరిగిపడే అవకాశాలు కూడా ఉన్నట్టు ఐఎండీ పేర్కొంది. 


Similar News