చట్టవిరుద్ధం.. కలకత్తా హైకోర్టు తీర్పుపై స్పందించిన దీదీ

కలకత్తా హైకోర్టు తీర్పుపై స్పందించారు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. 2016 టీచర్ రిక్రూట్ మెంట్ టెస్టు ద్వారా జరిగిన అన్ని నియామకాలను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు తీర్పు ఇచ్చింది,

Update: 2024-04-22 11:20 GMT

దిశ, నేషనల్ బ్యూరో: కలకత్తా హైకోర్టు తీర్పుపై స్పందించారు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. 2016 టీచర్ రిక్రూట్ మెంట్ టెస్టు ద్వారా జరిగిన అన్ని నియామకాలను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఆ ఉత్తర్వులు చట్టవిరుద్ధమని మమతా అన్నారు. కలకత్తా హైకోర్టు తీర్పుని సవాల్ చేస్తామని అన్నారు.

బెంగాల్‌లోని రాయ్‌గంజ్‌లో ఎన్నికల ర్యాలీలో ప్రసంగించారు మమతా బెనర్జీ. న్యాయవ్యవస్థను, తీర్పులను బీజేపీ నాయకులు ప్రభావితం చేస్తున్నారని ఆరోపించారు. పైగా 8 ఏళ్ల వేతనాన్ని 4 వారాల్లో చెల్లించడం ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. అన్ని రిక్రూట్‌మెంట్‌లను రద్దు చేస్తూ కోర్టు తీర్పు ఇవ్వడం చట్టవిరుద్ధం అని పేర్కొన్నారు. ఉద్యోగాలు కోల్పోయిన వారికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. వారికి న్యాయం జరిగేలా చూస్తామని.. కలకత్తా హైకోర్టు ఉత్తర్వులను పై కోర్టులో సవాలు చేస్తామని స్పష్టం చేశారు.

2016 నాటి స్టేట్ లెవల్ సెలక్షన్ టెస్ట్ నియామక ప్రక్రియను రద్దు చేయాలని బెంగాల్ ప్రభుత్వాన్ని ఆదేశించింది కలకత్తా హైకోర్టు ఆదేశించింది. మొత్తం 23,753 మంది ఉద్యోగాలు రద్దు చేయడమే కాకుండా.. నాలుగు వారాల్లో తీసుకున్న జీతాన్ని తిరిగి ఇచ్చేయాలని కోర్టు ఆదేశించింది. నాలుగు వారాల్లోగా తీసుకున్న జీతాన్ని 12 శాతం వడ్డీతో తిరిగి ఇచ్చేయాలని కోర్టు తీర్పు ఇచ్చింది ఈ వ్యక్తుల దగ్గర నుంచి ఆరు వారాల్లోగా డబ్బులు వసూలు చేయాలని జిల్లా అధికారులను కోర్టు ఆదేశించింది.


Similar News