‘ఇండియా’ పేరును మార్చే ప్రతిపాదన వస్తే ఆమోదిస్తాం : ఐరాస

‘ఇండియా’ పేరును ‘భారత్’ గా మారుస్తారని జరుగుతున్న ప్రచారంపై ఐక్యరాజ్యసమితి కూడా స్పందించింది.

Update: 2023-09-07 13:49 GMT

న్యూఢిల్లీ : ‘ఇండియా’ పేరును ‘భారత్’ గా మారుస్తారని జరుగుతున్న ప్రచారంపై ఐక్యరాజ్యసమితి కూడా స్పందించింది. పేర్ల మార్పులపై దేశాల నుంచి వచ్చే రిక్వెస్ట్‌లను పరిగణనలోకి తీసుకుంటామని స్పష్టం చేసింది. ఈ విషయాన్ని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ తరఫు డిప్యూటీ అధికార ప్రతినిధి ఫర్హాన్‌ హక్‌ వెల్లడించారు.

‘ఇండియా పేరు ఇంగ్లీష్‌లో కూడా భారత్ అని మారనుందా ?’ అని విలేకరులు అడిగిన ఓ ప్రశ్నకు ఆయన ఈ విధంగా బదులిచ్చారు. గత ఏడాది టర్కీ దేశం కూడా పేరును తుర్కియేగా మార్చుకున్న విషయాన్ని గుర్తు చేశారు. ఏ దేశమైనా ఇలాంటి అభ్యర్థనలు పంపిస్తే, సానుకూలంగానే పరిగణనలోకి తీసుకుంటామని తేల్చి చెప్పారు.


Similar News