ఎన్నికల వేళ సంచలన నిర్ణయం తీసుకున్న కంగనా రనౌత్

2024 పార్లమెంట్ ఎన్నికల వేళ బాలీవుడ్ స్టార్ హిరోయిన్ కంగనా రనౌత్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.

Update: 2024-05-18 16:24 GMT

దిశ, వెబ్ డెస్క్: 2024 పార్లమెంట్ ఎన్నికల వేళ బాలీవుడ్ స్టార్ హిరోయిన్ కంగనా రనౌత్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో మండి స్థానంలో గెలిస్తే నటనకు స్వస్తి చెబుతానని కంగనా రనౌత్ చెప్పారు. కంగనా రనౌత్ 2024 లోక్‌సభ ఎన్నికలలో తన రాజకీయ అరంగేట్రం చేసిన ఆమె భారతీయ జనతా పార్టీ (BJP) మండి నుంచి పోటీకి దింపింది. ఈ క్రమంలో ఎన్నికల ప్రచారంలో ఆమె చురుగ్గా పాల్గొంటున్నారు. కాంగ్రెస్ కంచుకోటగా చెప్పుకుంటున్న మండి నుంచి తనను గెలిపిస్తే.. తాను బాలీవుడ్ నుంచి తప్పుకుంటానని చెప్పింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఎన్నికలను కంగనా చాలా సీరియస్‌గా తీసుకోవడం గమనార్హం. కంగనా తన ఎన్నికల అపిడవిట్‌లో తన ఆస్తుల విలువ రూ. 91 కోట్లు, ఇందులో నగలు, కార్లు, స్థిరాస్తులు ఉన్నాయి. ఆమెకు రూ.17 కోట్ల అప్పు కూడా ఉందని. కంగనా తన వద్ద రూ. 28.7 కోట్ల విలువైన చరాస్తులు మరియు రూ. 62.9 కోట్ల స్థిరాస్తులు కలిగి ఉన్నట్లు ప్రకటించింది.


Similar News