పేదల నుంచి దోచుకున్న డబ్బును తిరిగి వారికి ఇచ్చేలా కృషి చేస్తాను: మోడీ
బెంగాల్‌లో పేదల నుంచి దోచుకున్న డబ్బును ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అటాచ్ చేయగా, తిరిగి ఆ డబ్బును వారికే అందించడానికి కృషి చేస్తున్నట్లు ప్రధాని మోడీ బెంగాల్‌లో బీజేపీ అభ్యర్థి అమృతా రాయ్‌తో బుధవారం ఫోన్‌లో మాట్లాడిన సందర్బంలో అన్నారు
దిశ, నేషనల్ బ్యూరో: బెంగాల్‌లో పేదల నుంచి దోచుకున్న డబ్బును ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అటాచ్ చేయగా, తిరిగి ఆ డబ్బును వారికే అందించడానికి కృషి చేస్తున్నట్లు ప్రధాని మోడీ బెంగాల్‌లో బీజేపీ అభ్యర్థి అమృతా రాయ్‌తో బుధవారం ఫోన్‌లో మాట్లాడిన సందర్బంలో అన్నారు. 'రాజమాత' గా పిలవబడే అమృతా రాయ్ కృష్ణనగర్ లోక్‌సభ నియోజకవర్గంలో టిఎంసీకి చెందిన మహువా మోయిత్రాపై పోటీకి దిగారు. ఈ నేపథ్యంలో రాజమాతతో మోడీ ఫోన్‌లో సంభాషించారు .పేదల నుండి దోచుకున్న డబ్బును అవినీతిపరుల నుండి ఈడీ జప్తు చేసిన ఆస్తులు, డబ్బులను వారికి తిరిగి వెళ్లేలా చూసేందుకు చట్టపరమైన అవకాశాలను అన్వేషిస్తున్నట్లు ఆమెతో అన్నారని బీజేపీ నాయకుడు చెప్పారు. దేశంలో అవినీతిని రూపుమాపేందుకు ఒకవైపు బీజేపీ కట్టుబడి ఉంటే, మరోవైపు అవినీతిపరులంతా ఒకరినొకరు రక్షించుకునేందుకు ఒక్కటయ్యారని మోదీ అన్నారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో కొత్త మార్పును ప్రజలు కోరుకుంటున్నారని ఆయన తెలిపారు.