బాణాసంచా ఫ్యాక్టరీలో భారీ పేలుడు!.. ముగ్గురు మృతి, మరొకరికి తీవ్ర గాయాలు

తమిళనాడులోని ఓ బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు సంభవించిన ఘటనలో ముగ్గురు మృతి చెందగా.. ఒకరు గాయపడ్డారు.

Update: 2024-06-29 07:24 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: తమిళనాడులోని ఓ బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు సంభవించిన ఘటనలో ముగ్గురు మృతి చెందగా.. ఒకరు గాయపడ్డారు. విరుదునగర్ జిల్లా సత్తూర్ లోని బాణాసంచా తయారు చేసే ఫ్యాక్టరీలో ఈ రోజు ఉదయం భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడుతో ఫ్యాక్టరీలో మంటలు చెలరేగాయి. అకస్మాత్తుగా పేలుడు జరగడంతో ఆ శబ్దం కొన్ని కిలోమీటర్ల మేర వినిపించింది. దీంతో స్థానికులు తీవ్ర గందరగోళానికి గురయ్యారు. భయంతో ఇళ్లలోనుంచి పరుగులు తీశారు. పేలుడు సంభవించిన ఘటన స్థలానికి చేరుకొని పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.

ఈ ఘటనలో ముగ్గురు చనిపోయారని, ఒకరికి తీవ్ర గాయాలు అవ్వగా.. మరికొందరు స్వల్ప గాయాలతో బయటపడ్డారని, మృతదేహాలను పోస్టు మార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు విరుద్ నగర్ జిల్లా కలెక్టర్ తెలిపారు. స్థానికుల సహాయంతో క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్నామని, ప్రమాదం ఎందుకు జరిగింది, ఎలా జరిగిందనే కోణంలో దర్యాప్తు జరుపుతున్నామని స్థానిక పోలీసు ఉన్నతాధికారి తెలిపారు. 

Similar News