HMPV: శ్వాసకోశ వ్యాధులపై నిఘా పెంచండి.. రాష్ట్రాలకు కేంద్రం ఆదేశాలు

హెచ్ఎంపీవీ వైరస్ ఆందోళనల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు పలు ఆదేశాలు జారీ చేసింది.

Update: 2025-01-07 14:07 GMT

దిశ, నేషనల్ బ్యూరో: హెచ్ఎంపీవీ (HMPV) వైరస్ ఆందోళనల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు పలు ఆదేశాలు జారీ చేసింది. శ్వాసకోశ వ్యాధులపై నిఘా పెంచాలని, వైరస్ వ్యాప్తిని నియంత్రించడంపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించింది. ఈ మేరకు ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. దేశంలో శ్వాసకోశ వ్యాధులు, హెచ్‌ఎంపీవీ కేసులను అరికట్డడానికి తీసుకోవాల్సిన చర్యలపై కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి పుణ్య సలీల శ్రీవాస్తవ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో చర్చించిన అనంతరం ఈ ఆదేశాలు జారీ చేశారు. సబ్సులతో తరచుగా చేతులు కడుక్కోవడం, ఇతర సాధారణ చర్యలపై అవగాహన కల్పించాలని శ్రీవాస్తవ సూచించారు. శ్వాసకోశ వ్యాధుల విషయంలో ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికి దేశం పూర్తి సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. చైనాలో పెరుగుతున్న ఫ్లూ కేసుల పరిస్థితిని ప్రభుత్వం నిశితంగా పరిశీలిస్తోందని వెల్లడించారు. ఐసీఎంఆర్, వీఆర్ డీఎల్ ల్యాబుల్లో వ్యాధి నిర్ధారణ సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని స్పష్టం చేశారు.

Tags:    

Similar News