హీరాబెన్ మోడీ నేపథ్యమిదే..

హీరాబెన్ 1923 జూన్ 18న వాద్ నగర్, మెహసానా, గుజరాత్‌లో జన్మించారు.

Update: 2022-12-30 02:53 GMT

దిశ, వెబ్ డెస్క్: హీరాబెన్ 1923 జూన్ 18న వాద్ నగర్, మెహసానా, గుజరాత్‌లో జన్మించారు. ఆమె భర్త దామోదర్ దాస్ మూల్ చంద్ మోడీ టీ విక్రయించేవారు. 1989లో బోన్ క్యాన్సర్‌తో పోరాడి మృతి చెందారు. వీరికి ఐదుగురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. కుమారులు సోమమోడీ, ఆరోగ్యశాఖలో రిటైర్డ్ అధికారి, పంకజ్ మోడీ గుజరాత్ ప్రభుత్వ సమాచార శాఖలో క్లర్స్, అమృత్ మోడీ రిటైర్డ్ లేత్ మిషన్ ఆపరేటర్, ప్రహ్లాద్ మోడీ ఒక దుకాణాన్ని నడుపుతున్నారు. ఆమెకు మూడవ సంతానంగా నరేంద్ర మోడీ జన్మించారు. భారత 14 వ ప్రధానిగా అంతకు ముందు గుజరాత్ రాష్ట్రానికి నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. వీరికి కూతురు వాసంతీబెన్ హస్ముఖ్ లాల్ మోడీ ఉన్నారు. కాగా హీరాబెన్‌తో మోడీకి ప్రత్యేక అనుబంధం ఉండేది. 


Similar News