కాంగ్రెస్ ఎంపీపై సీఎం భార్య పరువునష్టం దావా..

అస్సాంలోని నగౌన్ జిల్లాలో ఓ ఫుడ్ ప్రాసెసింగ్ ప్రాజెక్ట్ విషయంలో తనపై అవినీతి ఆరోపణలు చేసిన కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్‌

Update: 2023-09-23 13:40 GMT

గౌహతి : అస్సాంలోని నగౌన్ జిల్లాలో ఓ ఫుడ్ ప్రాసెసింగ్ ప్రాజెక్ట్ విషయంలో తనపై అవినీతి ఆరోపణలు చేసిన కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్‌పై అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ భార్య రినికి భూయాన్ శర్మ రూ.10 కోట్లకు పరువునష్టం దావా వేశారు. రాష్ట్రంలోని కామరూప్ సివిల్ జడ్జి కోర్టులో శుక్రవారం దాఖలైన ఈ కేసు, సెప్టెంబర్ 26న విచారణకు రానుంది.

ట్విట్టర్‌లో వరుస ట్వీట్లు చేయడం ద్వారా కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ తన పరువుకు నష్టం కలిగించారని ఆ పిటిషన్‌లో రినికి భూయాన్ శర్మ ఆరోపించారు. ఇప్పటివరకూ ఫుడ్ ప్రాసెసింగ్ ప్రాజెక్టులో తనకు ఎలాంటి సబ్సిడీ అందలేదని ఆమె స్పష్టం చేశారు. ఈ ఏడాది మే26న కేంద్ర ఆహార శాఖ తనకు షోకాజ్ నోటీసు ఇచ్చిందని చెప్పారు. ఫుడ్ ప్రాసెసింగ్ ప్రాజెక్టులో సబ్సిడీలు పొందినట్లు గొగోయ్ చేసిన ఆరోపణలన్నీ అబద్ధాలేనని తేల్చి చెప్పారు.


Similar News