రాహుల్ ‘బాడీ డబుల్’ ఎవరో తెలిసిపోయింది : హిమంత
దిశ, నేషనల్ బ్యూరో : త్వరలోనే రాహుల్ గాంధీ ‘బాడీ డబుల్’ గుట్టును రట్టు చేస్తామని అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వ శర్మ చెప్పారు.
దిశ, నేషనల్ బ్యూరో : త్వరలోనే రాహుల్ గాంధీ ‘బాడీ డబుల్’ గుట్టును రట్టు చేస్తామని అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వ శర్మ చెప్పారు. శని, ఆదివారాల్లో రాష్ట్రంలో ప్రధాని మోడీ పర్యటన ఉందని.. అది ముగిసిన వెంటనే ప్రెస్‌మీట్ పెట్టి మరీ రాహుల్ బాడీ డబుల్ ఎవరనే బండారాన్ని బయటపెడతానని ఆయన తెలిపారు. అసోంలో నిర్వహించిన భారత్ జోడో న్యాయ్ యాత్రలో రాహుల్ గాంధీ ఉపయోగించిన బాడీ డబుల్‌ను గుర్తించామన్నారు. బాడీ డబుల్‌పై గువహటి, జోర్హాట్‌లలో రెండు కేసులు కూడా నమోదయ్యాయని హిమంత పేర్కొన్నారు. అసోంలో నిర్వహించిన యాత్రలో వాహనం లోపలి నుంచి చేయి ఊపుతూ జనాలను ఉత్సాహపరిచేందుకు బాడీ డబుల్‌ను రాహుల్ వాడుకున్నారని వెల్లడైనట్లు ఆయన వివరించారు. ఈవిషయంపై చర్చ మొదలుకావడంతో రాహుల్ గాంధీ బాడీ డబుల్.. అసోంలోని గౌహతి నుంచి సైలెంట్‌గా జారుకున్నాడని హిమంత తెలిపారు. గువహటిలో బాడీ డబుల్ వ్యవహారంలో నమోదైన కేసును విచారించేందుకు సిట్ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.