Himachal Pradesh: హిమాచల్‌ ప్రదేశ్‌లో వర్ష బీభత్సం..56 మంది మృతి

హిమాచల్ ప్రదేశ్‌లో వర్షాలు బీభత్సం సృష్టించాయి. రుతుపవనాలు ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు కురిసిన వర్షాల వల్ల పలు ఘటనల్లో 56 మంది మరణించారు.

Update: 2024-07-27 16:18 GMT

దిశ, నేషనల్ బ్యూరో: హిమాచల్ ప్రదేశ్‌లో వర్షాలు బీభత్సం సృష్టించాయి. రుతుపవనాలు ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు కురిసిన వర్షాల వల్ల పలు ఘటనల్లో 56 మంది మరణించారు. అలాగే రూ.410కోట్ల నష్టం వాటిల్లినట్టు రాష్ట్ర ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ వెల్లడించింది. దాదాపు100 ఇళ్లు దెబ్బతినగా.. పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ అత్యధికంగా రూ.172 కోట్లు, హార్టికల్చర్ డిపార్ట్‌మెంట్ రూ.139 కోట్ల నష్టాన్ని చవి చూశాయని తెలిపింది. కొండచరియలు విరిగిపడటం, పిడుగుపాటుల కారణంగా ఎటువంటి మరణాలు సంభవించలేదని పేర్కొంది. రాష్ట్రంలో జూన్ 27న రుతుపవనాలు సంభవించగా..పలు ప్రాంతాల్లో అడపాదడపా వర్షాలు కురుస్తున్నాయి. అప్పటి నుంచి జూలై 27 వరకు 40 శాతం వర్షపాతం నమోదైంది. అత్యధికంగా సిర్మౌర్ జిల్లాలోని ధౌలకువాన్‌లో123 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. మరోవైపు ఈ నెల 31 వరకు రాష్ట్రంలోని ఎనిమిది జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని సిమ్లా వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

Tags:    

Similar News