Himachal Pradesh: మేకప్ లేకుంటే ఆమెను గుర్తించరు.. కంగనాపై కాంగ్రెస్ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు

హిమాచల్ ప్రదేశ్(Himachal Pradesh) కాంగ్రెస్ ఎమ్మెల్యే జగత్ సింగ్ నేగి(Jagat Singh Negi) వివాదంలో చిక్కుకున్నారు.

Update: 2024-09-04 09:23 GMT

దిశ, నేషనల్ బ్యూరో: హిమాచల్ ప్రదేశ్(Himachal Pradesh) కాంగ్రెస్ ఎమ్మెల్యే జగత్ సింగ్ నేగి(Jagat Singh Negi) వివాదంలో చిక్కుకున్నారు. మండి లోక్ సభ బీజేపీ ఎంపీ, బాలీవుడ్‌ క్వీన్ కంగనా రనౌత్(Kangana Ranaut) పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. మేకప్‌ లేకుంటే (make up remark) కంగనాను ప్రజలు గుర్తించలేరని కామెంట్స్ చేశారు. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీలో కాంగ్రెస్ ఎమ్మెల్యే(Congress MLA) జగత్ సింగ్ నేగీ మాట్లాడుతూ.. ‘వరదలు తగ్గి సాధారణ స్థితికి వచ్చాక కంగనా రాష్ట్రానికి వచ్చారు. భారీ వర్షాలు పడతాయని హెచ్చరికలు వచ్చినప్పుడు ఆమె రాలేదు. కంగనా సొంత నియోజకవర్గం మండిలో తొమ్మిది మంది మరణించినప్పుడు కూడా రాలేదు. వర్షం పడుతున్నప్పుడు మేకప్‌ కొట్టుకుపోతుంది.. అందుకే ఆమె రావడానికి ఇష్టపడలేదు. మేకప్‌ లేకుండా ఆమెను ప్రజలు గుర్తించలేరు. వరద పరిస్థితి మెరుగుపడినాక వచ్చి మొసలి కన్నీరు(crocodile tears) కార్చారు’ అంటూ విమర్శలు గుప్పించారు.

మంత్రి వ్యాఖ్యలు ఖండించిన బీజేపీ

ఇటీవలే హిమాచల్‌ ప్రదేశ్‌ను భారీ వరదలు అతలాకుతలం చేశాయి. ఈ వర్షాల వల్ల కనీసం 153 మంది మరణించారు. సుమారు రూ.1200 కోట్ల మేర నష్టం వాటిల్లింది. దీంతో, వరద ప్రభావిత ప్రాంతాన్ని గత నెలలో కంగన సందర్శించి.. బాధితులను పరామర్శించారు. ఆ ఫొటోలను కంగనా సోషల్ మీడియా ఎక్స్ వేదికగా షేర్ చేశారు. ఆ ఫొటోలపై జగత్‌ సింగ్‌ నేగి ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇకపోతే, జగత్‌ సింగ్‌ నేగి వ్యాఖ్యలపై హిమాచల్‌ ప్రదేశ్‌ బీజేపీ(BJP's Himachal unit) యూనిట్ మండిపడంది. జగత్ సింగ్ నేగి వ్యాఖ్యలు మహిళలను అవమానించేవిలా ఉన్నాయంటూ ఫైర్ అయ్యింది.


Similar News