Haryana Polls : హర్యానా ఎన్నికలకు భారీ భద్రతా ఏర్పాట్లు.. 60వేల భద్రతా సిబ్బంది మోహరింపు

దిశ, నేషనల్ బ్యూరో : హర్యానా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఈనెల 5న (శనివారం) జరగబోతోంది.

Update: 2024-10-02 14:36 GMT

దిశ, నేషనల్ బ్యూరో : హర్యానా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఈనెల 5న (శనివారం) జరగబోతోంది. ఇందుకోసం కేంద్ర ఎన్నికల సంఘం భారీ భద్రతా ఏర్పాట్లు చేసింది. 225 పారామిలిటరీ కంపెనీలు, 60వేల భద్రతా సిబ్బందిని రాష్ట్రంలో మోహరించారు. 11వేల మంది స్పెషల్ పోలీసు ఆఫీసర్లను కూడా నియమించారు. ఈవివరాలను హర్యానా డీజీపీ శత్రుజీత్ కపూర్ బుధవారం వెల్లడించారు. అత్యంత సమస్యాత్మకమైన నుహ్ ప్రాంతంలో 13 పారామిలిటరీ కంపెనీలను మోహరించినట్లు చెప్పారు.

పోలింగ్ తేదీ సమీపించిన వేళ ఇప్పటివరకు పోలీసులు జరిపిన తనిఖీల్లో అత్యధికంగా డబ్బును గురుగ్రామ్, ఫరీదాబాద్, అంబాలాలలో స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం రూ.60 కోట్లకుపైగా నగదును స్వాధీనం చేసుకున్నామన్నారు. ఇటీవలే తాము 27వేల లీటర్ల లిక్కర్‌ను సీజ్ చేశామని డీజీపీ శత్రుజీత్ వెల్లడించారు.


Similar News