Gujarat ATS : రూ.51.4 కోట్లు విలువైన డ్రగ్స్ సీజ్

దిశ, నేషనల్ బ్యూరో : గుజరాత్‌లోని యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఏటీఎస్) గురువారం సూరత్ శివార్లలో రూ.51.4 కోట్లు విలువైన డ్రగ్స్, వాటి తయారీ సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.

Update: 2024-07-18 16:29 GMT

దిశ, నేషనల్ బ్యూరో : గుజరాత్‌లోని యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఏటీఎస్) గురువారం సూరత్ శివార్లలో రూ.51.4 కోట్లు విలువైన డ్రగ్స్, వాటి తయారీ సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఈ డ్రగ్స్ తయారీ కోసం పల్సానా తాలూకా కరేలి గ్రామంలో ప్రత్యేక యూనిట్‌ను నిర్వహిస్తున్న ముగ్గురు వ్యక్తులను(సునీల్ యాదవ్, విజయ్ గజేరా, హరేష్ కోరాట్‌) అరెస్టు చేశారు. ఈ సోదాల్లో 4 కిలోల మెఫిడ్రోన్, 31.4 కిలోల మెఫిడ్రోన్ తయారీ ముడిసరుకును స్వాధీనం చేసుకున్నట్లు ఏటీఎస్ డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ సునీల్ జోషి వెల్లడించారు. డ్రగ్స్ తయారీ యూనిట్‌‌కు సీలు వేశామని ఆయన తెలిపారు. డ్రగ్స్ తయారీ కోసం కరేలి గ్రామంలో ప్రతినెలా రూ.20వేల అద్దెకు షెడ్డును ఈ ముఠా సభ్యులు అద్దెకు తీసుకున్నట్లు విచారణలో పోలీసులు గుర్తించారు. వీరు ఇప్పటికే 4 కిలోల మెఫెడ్రోన్ డ్రగ్‌ను ముంబైకి చెందిన సలీం సయ్యద్‌కు విక్రయించినట్లు దర్యాప్తులో వెల్లడైంది.

Tags:    

Similar News