గుజరాత్‌లో పాక్ గూఢచారి అరెస్ట్..

భారత ఆర్మీకి సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని పాకిస్థాన్ గూఢచర్య సంస్థ ఐఎస్ఐకు చేరవేస్తున్న లాభ్‌శంకర్ మహేశ్వరి(55) అనే వ్యక్తిని గుజరాత్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ఏటీఎస్) అరెస్టు చేసింది.

Update: 2023-10-20 12:14 GMT

గాంధీనగర్ : భారత ఆర్మీకి సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని పాకిస్థాన్ గూఢచర్య సంస్థ ఐఎస్ఐకు చేరవేస్తున్న లాభ్‌శంకర్ మహేశ్వరి(55) అనే వ్యక్తిని గుజరాత్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ఏటీఎస్) అరెస్టు చేసింది. పాకిస్థాన్‌లోనే పుట్టిన లాభ్‌శంకర్ మహేశ్వరి 1999లో భారత్‌‌కు వలస వచ్చాడు. గుజరాత్‌లోని ఆనంద్ జిల్లాలో ఉన్న తపూర్‌ టౌన్‌లో ఉంటూ.. భారత పౌరసత్వం తీసుకున్నాడు. అయినా లాభ్‌శంకర్ పాక్ ఐఎస్ఐతో నిత్యం టచ్‌లో ఉండేవాడని గుర్తించారు. తన వాట్సాప్ నంబర్ నుంచి గుజరాత్‌లోని ఆర్మీ సిబ్బంది కుటుంబ సభ్యులకు ప్రమాదకర ‘రిమోట్ యాక్సెస్ ట్రోజన్’ వైరస్‌తో కూడిన మెసేజ్ లింకులను పంపేవాడు.

వారు ఆ లింక్‌ను ఓపెన్ చేయగానే.. ఫోన్‌లోని సమాచారాన్ని, ఫైల్స్‌ను పొందేలా ఆ మెసేజ్ లింకులో ముందస్తు సెట్టింగ్స్ చేసేవాడు. ఆర్మీ పబ్లిక్ స్కూల్‌ నుంచి మాట్లాడుతున్నట్టుగా వారిని మాటలతో బురిడీ కొట్టించేవాడు. భారత ఆర్మీ ఇంటెలీజెన్స్ విభాగం ఈవిషయాన్ని గుర్తించి.. గుజరాత్ ఏటీఎస్‌కు సమాచారం ఇవ్వడంతో లాభ్ శంకర్‌‌ను అరెస్టు చేశారు. భారత్‌లోని పాకిస్థాన్ రాయబార కార్యాలయానికి చెందిన ఓ వ్యక్తి లాభ్ శంకర్‌ మహేశ్వరికి ఈ గూఢచర్య యాక్టివిటీలో గైడ్ చేస్తున్నట్లు వెల్లడైంది.

Tags:    

Similar News