నాలుగు గంటల్లో 102 సీట్లలో ఎంత శాతం పోలింగ్ అయ్యిందంటే?

లోక్ సభ ఎన్నికలకు తొలి దశ పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతోంది. మొత్తం 21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 102 స్థానాలకు పోలింగ్‌ జరుగుతోంది.

Update: 2024-04-19 07:20 GMT

దిశ, నేషనల్ బ్యూరో: లోక్ సభ ఎన్నికలకు తొలి దశ పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతోంది. మొత్తం 21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 102 స్థానాలకు పోలింగ్‌ జరుగుతోంది. ఉదయం 7 గంటలకే పోలింగ్‌ ప్రారంభం కాగా.. సాయంత్రం 6 గంటలవరకూ కొనసాగనుంది. కాగా.. పోలింగ్ ప్రారంభమైన 4 గంటల్లో 24 శాతం పోలింగ్ నమోదైంది. అయితే, ఉదయం 11 గంటల వరకు త్రిపురలో అత్యధిక శాతం పోలింగ్ నమోదైనట్లు తెలిపింది ఎన్నికల సంఘం. త్రిపురలో 33.28 శాతం పోలింగ్ నమోదైనట్లు తెలిపింది. ఇక అత్యల్పంగా లక్షద్వీప్ లో 16.33 శాతం పోలింగ్ నమోదైంది.

అండమాన్‌ నికోబార్‌ దీవుల్లో 21.82 శాతం, అరుణాచల్‌ ప్రదేశ్‌ లో 18.26 శాతం, అసోంలో 27.22 శాతం, బిహార్‌ లో 20.42 శాతం, ఛత్తీస్‌గఢ్‌ లో 28.12 శాతం పోలింగ్ నమోదైంది. జమ్మూ కశ్మీర్‌ లో 22.60 శాతం, లక్షద్వీప్‌ లో 16.33 శాతం, మధ్యప్రదేశ్‌ లో 30.46 శాతం, మహారాష్ట్రలో 19.17 శాతం, మణిపూర్‌ లో 27.64 శాతం ఓటింగ్ నమోదైంది. మేఘాలయాలో 31.65 శాతం, మిజోరాంలో 26.23 శాతం, నాగాలాండ్‌ లో 22.50 శాతం, పుదుచ్ఛేరిలో 27.63 శాతం పోలింగ్ నమోదైంది. రాజస్థాన్‌ లో 22.51 శాతం, సిక్కింలో 21.20 శాతం, తమిళనాడులో 23.72 శాతం ఓటింగ్ నమోదైంది. త్రిపురలో 33.28 శాతం, ఉత్తరప్రదేశ్‌ లో 25.20 శాతం, ఉత్తరాఖండ్‌ లో 24.83 శాతం నమోదైంది.


Similar News