ఆ రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కూడా పోటీ చేస్తాం: కేజ్రీవాల్

ఆప్ సీఎంలు అరవింద్ కేజ్రివాల్, భగవంత్ సింగ్ మాన్ అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా... "Governments Bought And Sold Here": Arvind Kejriwal In Madhya Pradesh

Update: 2023-03-14 13:30 GMT

భోపాల్: ఆప్ సీఎంలు అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ సింగ్ మాన్ అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా ప్రచార జోరు పెంచారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో రాజస్థాన్‌, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో అన్ని స్థానాల్లో బరిలోకి దిగుతామని ప్రకటించారు. బుధవారం మధ్యప్రదేశ్ భోపాల్‌లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ప్రస్తుతం ప్రభుత్వాలు అమ్మడం, కొనడం జరగుతుందని విమర్శించారు. ప్రతి ఎన్నికల తర్వాత గెలిచిన పార్టీ ఎమ్మెల్యేలను కొనేందుకు ఇంకో పార్టీ సిద్ధంగా ఉంటుందని ఆరోపించారు. దీన్ని ఒక వ్యవస్థ, ప్రజాస్వామ్యంగా మార్చారని సెటైర్లు వేశారు. ఇలాంటి వాటితో మధ్యప్రదేశ్ ప్రజలు విసుగు చెందారని అన్నారు. ఎవరికి ఓటేసిన మామానే అధికారంలోకి వస్తున్నారని సీఎం శివరాజ్ సింగ్ చౌహన్‌పై వ్యంగ్యస్త్రాలు సంధించారు. 2018లో జరిగిన ఎన్నికల్లో మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ గెలిచినప్పటికీ, 2020లో ఆ పార్టీ నేతలు జ్యోతిరాధిత్య సింథియాతో సహా 20 మంది బీజేపీలోకి చేరడంతో కాషాయపార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. రాజస్థాన్ లో 200 అసెంబ్లీ స్థానాలుండగా, మధ్యప్రదేశ్‌లో 230 స్థానాలున్నాయి.

Tags:    

Similar News