Mahua Moitra : మహువా మోయిత్రా కేసుపై ఎథిక్స్ కమిటీ కీలక ప్రకటన

Update: 2023-10-20 14:15 GMT

న్యూఢిల్లీ: పార్లమెంట్‌లో ప్రశ్నలు అడిగేందుకు తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మోయిత్రాకు లంచం ఇచ్చారని పారిశ్రామికవేత్త దర్శన్ హీరానందానీ అఫిడవిట్‌ను అంగీకరించారని, అది తమ వద్ద చేరినట్టు లోక్‌సభ ఎథిక్స్ కమిటీ శుక్రవారం ప్రకటించింది. 'దర్శన్ హీరానందానీ అఫిడవిట్ అందింది. ప్రశ్నలు అడిగేందుకు లంచం తీసుకున్నారనే ఆరోపణలు చాలా తీవ్రమైనవి. బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే ఫిర్యాదును ఎథిక్స్ కమిటీ అక్టోబర్ 26న విచారణ చేపడుతుంది. అదేరోజు ఆయన ఆరోపణలకు సంబంధించిన ఆదాయాలు ఇవ్వాల్సి ఉంటుంది. ముందుగా నిషికాంత్ దూబే లేఖను, హీరానందానీ అఫిడవిట్‌ను పరిశీలించడం జరుగుతుంది. అనంతరం మహువా మొయిత్రా వాదనను విననుట్లు 'ఎథిక్స్ కమిటీ ఛైర్మన్ వినోద్ కుమార్ సోంకార్ మీడియాకు వెల్లడించారు.

మరోవైపు, తనపై వస్తున్న ఆరోపణలను మహువా మొయిత్రా తీవ్రంగా ఖండించారు. తనను ఎలాంటి విచారణకు రమ్మన్నా సిద్ధమే. ఆలోపు అవాస్తవాలు ప్రచారం కాకుండా నిషేధించాలని డిమాండ్ చేశారు. లోక్‌సభ నిబంధనలను ఎథిక్స్ కమిటీ పరిశీలించాలి. అఫిడవిట్ మీడియాకు ఎలా లీక్ అయిందనే అంశాన్ని గమనించాలని చెప్పారు. లీక్‌పై ఛైర్మన్ మొదట విచారించాలి. అదానీ అంశంపై మాట్లాడకుండా తనను లోక్‌సభ నుంచి బహిష్కరించాలనే లక్ష్యంతోనే బీజేపీ ఇదంతా చేస్తోందని ఎక్స్ పోస్ట్‌లో ఆమె పేర్కొన్నారు.

Tags:    

Similar News