Gold Seize: అహ్మదాబాద్‌లో సంచలనం.. 107 కిలోల బంగారం, నగదు పట్టివేత
అహ్మదాబాద్ (Ahmedabad) నగరంలోని పాల్డి (Padi) ప్రాంతంలో సంచలనం చోటుచేసుకుంది.

దిశ, వెబ్‌డెస్క్: అహ్మదాబాద్ (Ahmedabad) నగరంలోని పాల్డి (Padi) ప్రాంతంలో సంచలనం చోటుచేసుకుంది. గుజరాత్ ఉగ్రవాద నిరోధక దళం (ATS), డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) జాయింట్ ఆపరేషన్‌లో భాగంగా మొత్తం 107 కిలోల బంగారంతో పాటు రూ.60 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. నిందితులు మేఘ్ షా (Megh Shah) అతడి తండ్రి మహేంద్ర షా (Mahindra Shah) దాదాపు రూ.100 కోట్ల విలువైన స్మగ్లింగ్ బంగారంతో పాటు నగదును ఫ్లాట్‌లో దాచిపెట్టారనే సమాచారం పోలీసులకు అందింది.
దీంతో రంగంలోకి దిగిన ఏటీఎస్ (ATS), డీఆర్ఐ (DRI) బృందాలు సంయుక్తంగా ఆపరేషన్ చేపట్టాయి. పాల్డి (Paldi) ప్రాంతంలో ఉన్న అవిష్కార్ అపార్ట్‌మెంట్ (Avishkar Apartment)లోని మూసి ఉన్న ఫ్లాట్‌ను తెరిచి చూడగా.. అక్కడ 107 కిలోల బంగారంతో పాటు రూ.60 లక్షల నగదు కూడా లభ్యమైంది. అయితే, దొరికిన బంగారం విలువను లెక్కిస్తున్నామని ATS అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఎస్ఎల్ చౌదరి తెలిపారు. నిందితులు, మేఘ్ షా, మహేద్ర షా షేర్ మార్కెట్ ట్రేడింగ్, బెట్టింగ్, బంగారాన్ని పెద్ద ఎత్తున స్మగ్లింగ్ చేస్తున్నారని వెల్లడించారు. త్వరలోనే వారిని కూడా పట్టుకుంటామని ఎస్ఎల్ చౌదరి స్పష్టం చేశారు.