'బెస్ట్ ఎయిర్‌పోర్ట్ అవార్డు 2023' గెలుచుకున్న జీఎంఆర్ హైదరాబాద్ విమానాశ్రయం

ప్రపంచవ్యాప్తంగా 400కి పైగా విమానాశ్రయాల సంస్థలు పాల్గొన్న పోటీలో తాము మరోసారి ఏసీఐ నుంచి గుర్తింపు పొందామని

Update: 2024-03-11 14:15 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో ఏడాదికి 1.5-2.5 కోట్ల మంది ప్రయాణీకులతో కూడిన ఉత్తమ విమానాశ్రయంగా 'ఎయిర్‌పోర్ట్ సర్వీస్ క్వాలిటీ(ఏఎస్‌క్యూ) బెస్ట్ ఎయిర్‌పోర్ట్-2023' అవార్డును గెలుచుకున్నట్టు జీఎంఆర్ హైదరాబాద్ విమానాశ్రయ సంస్థ సోమవారం ప్రకటనలో తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా 400కి పైగా విమానాశ్రయాల సంస్థలు పాల్గొన్న పోటీలో తాము మరోసారి ఎయిర్‌పోర్ట్స్ కౌన్సిల్ ఇంటర్నేషనల్(ఏసీఐ) నుంచి గుర్తింపు పొందామని సంస్థ తెలిపింది. 'ఈ అవార్డును సంస్థ ఉద్యోగులకు, విమానాశ్రయ వాటాదారులందరికీ అంకితం చేస్తున్నాం. అవిశ్రాంతంగా నిబద్ధతో కృషి చేయడం ద్వారానే తాము ఈ గుర్తింపును సాధించగలిగామని ' జీఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ సీఈఓ ప్రదీప్ పనికర్ చెప్పారు. 'విస్తరణలో భాగంగా మేము టర్మినల్, ఎయిర్‌సైడ్ ఏరియాల్లో కొత్త సౌకర్యాలను, గ్రౌండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను రూపొందించాం. ఇది సామర్థ్యాన్ని పెంపొందించడంలో, వినియోగదారులకు సౌలభ్యాన్ని అందించడం వంటివి ఎయిర్‌పోర్ట్ ఎక్స్‌పీరియన్స్‌ని పెంచడంలో కీలకంగా దోహదపడ్డాయని ఆయన పేర్కొన్నారు.

Tags:    

Similar News