Maharashtra: మహారాష్ట్ర బరిలో 4,140 అభ్యర్థులు

ఈ నెల 20వ తేదీన జరగనున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 288 అసెంబ్లీ సీట్లల్లో 4,140 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు.

Update: 2024-11-04 19:06 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ఈ నెల 20వ తేదీన జరగనున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో(Maharashtra Assembly Elections) మొత్తం 288 అసెంబ్లీ సీట్లల్లో 4,140 మంది అభ్యర్థులు(Candidates) పోటీ పడుతున్నారు. ఎన్నికల కోసం మొత్తం 7,078 చెల్లుబాటయ్యే నామినేషన్లు(Nominations) వచ్చినట్టు ఈసీ తెలిపింది. కానీ, ఇందులో 2,938 మంది అభ్యర్థులు తమ నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. దీంతో బరిలో 4,140 మంది ఉన్నట్టు రాష్ట్ర ఎన్నికల అధికారి వివరించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో 3,239 మంది అభ్యర్థులు పోటీ చేశారు. గతంలో కంటే ఇప్పుడు 901 మంది పోటీపడుతున్నారు. షాహద సీటులో కనిష్టంగా ముగ్గురు పోటీ చేస్తుండగా, మజల్గావ్‌లో గరిష్టంగా 34 మంది బరిలో నిలిచారు. ముంబయిలోని మొత్తం 36 సీట్లల్లో 420 మంది, పూణే జిల్లాలోని 21 సీట్లల్లో 303 మంది పోటీ చేస్తున్నారు.

Tags:    

Similar News