Canada: ఖలిస్థానీలకు మద్దతు పలిన పోలీస్ అధికారిపై వేటు

కెనడా(Canada) బ్రాంప్టన్‌లోని(Brampton) ఆలయంలో ఖలిస్థానీ మద్దతుదారులు(pro-Khalistan supporters) దాడిలో కీలక పరిణామం జరిగింది.

Update: 2024-11-05 04:34 GMT

దిశ, నేషనల్ బ్యూరో: కెనడా(Canada) బ్రాంప్టన్‌లోని(Brampton) ఆలయంలో ఖలిస్థానీ మద్దతుదారులు(pro-Khalistan supporters) దాడిలో కీలక పరిణామం జరిగింది. హిందూ దేవాలయాలపై దాడికి పాల్పడ్డ వారిపై కెనడా ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. ఖలిస్థానీలకు మద్దతు పలుకుతున్న ప్రభుత్వ అధికారులపై కెనడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఇందులో భాగంగా ఖలిస్థాని జెండాతో కెనడా పీల్ ‌ప్రాంత రీజనల్‌ పోలీసు అధికారి హరీందర్ సోహీపై ఆందోళన చేపట్టారు. ఖలిస్థానికి మద్దతుగా, భారత్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. హరీందర్‌ సోహీ నినాదాలు చేస్తున్న వీడియోలు వైరల్‌గా మారాయి. దీంతో కెనడా పోలీస్‌ శాఖ సోహీపై వేటు వేస్తూ నిర్ణయం తీసుకుంది. కెనడా కమ్యూనిటీ సేఫ్టీ, పోలీసింగ్‌ యాక్ట్‌ నిబంధనల్ని ఉల్లంఘించినందనే హరీందర్‌ సోహీపై చర్యలు తీసుకున్నట్లు మీడియా రిలేషన్స్ ఆఫీసర్ రిచర్డ్‌ చిన్‌ తెలిపారు.మరోవైపు, బ్రాంప్టన్ లో జరిగిన దాడిని సీరియస్ గా తీసుకున్న కెనడా ప్రభుత్వం ఈ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది.

ప్రధాని మోడీ ఆగ్రహం

కెనడాలోని హిందూ ఆలయం లక్ష్యంగా జరిగిన దాడి ఘటనపై ప్రధాని నరేంద్ర మోడీ(PM Modi) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్దేశపూర్వకంగా చేసిన ఈ విధ్వంసాన్ని ఖండిస్తున్నట్లు ఎక్స్‌ వేదికగా ట్వీట్‌ చేశారు. భారత దౌత్యవేత్తలను బెదిరించే హేయమైన ప్రయత్నాలు కూడా అంతే దారుణమైనవి పేర్కొన్నారు. ఇలాంటి హింసాత్మక చర్యలు భారత్ స్థైర్యాన్ని ఏమాత్రం బలహీనపరచలేవన్నారు. ఈ ఘటనపై కెనడా ప్రభుత్వం చట్టపరంగా వ్యవహరిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నట్లు మోడీ పేర్కొన్నారు. మరోవైపు, బ్రాంప్టన్‌లోని హిందూ ఆలయాన్ని లక్ష్యంగా చేసుకొని కొందరు ఖలిస్థానీలు భక్తులపై దాడులు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో, ఈ ఘటన సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.


Similar News