'అమ్మాయిలు 17 ఏళ్లకే తల్లులవుతారు.. మనుస్మృతి చదవండి'.. హైకోర్టు జడ్జి ఆశ్చర్యకర వ్యాఖ్యలు
‘పాత కాలంలో అమ్మాయిలు 14-15 ఏళ్లకే పెళ్లిళ్లు చేసుకునే వారు.
అహ్మదాబాద్: ‘పాత కాలంలో అమ్మాయిలు 14-15 ఏళ్లకే పెళ్లిళ్లు చేసుకునే వారు. 17 ఏళ్లలోపే తల్లులయ్యే వారు. మీరు మనుస్మృతి చదవండి’ అంటూ గుజరాత్ హైకోర్టు జడ్జి ఆశ్చర్యకర వ్యాఖ్యలు చేశారు. అత్యాచార బాధితురాలైన 17 ఏళ్ల మైనర్ బాలిక 7 నెలల గర్భాన్ని తొలగించేందుకు (అబార్షన్) అనుమతి ఇవ్వాలని దాఖలైన ఓ పిటిషన్ పై విచారణ సందర్భంగా న్యాయమూర్తి జస్టిస్ సమీర్ జె డేవ్ ఈ వ్యాఖ్య చేశారు. డెలివరీ తేదీ ఆగస్టు 18 అయినందున ముందస్తు విచారణ కోసం సీనియర్ న్యాయవాది సికందర్ సయ్యద్ కోర్టు ముందు అప్పీల్ చేశారు. అయితే.. బాలిక, పిండం ఆరోగ్యంగా ఉంటే అబార్షన్ కు అనుమతించేది లేదని కోర్టు స్పష్టం చేసింది. బాలికకు వైద్య పరీక్షలు నిర్వహించాలని రాజ్ కోట్ ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్ ను ఆదేశించింది.