Ashok Gehlot : విప్తతు నిర్వహణ మంత్రి ఉన్నారా ? లేరా ? : అశోక్ గెహ్లాట్

దిశ, నేషనల్ బ్యూరో : ఓ వైపు వర్ష బీభత్సానికి ప్రజలు ప్రాణాలను కోల్పోతుంటే.. మరోవైపు రాష్ట్రానికి విపత్తు నిర్వహణ శాఖ మంత్రి ఉన్నారా ? లేరా ? అనే దానిపై డైలమా నెలకొనడం దారుణమని రాజస్థాన్ మాజీ సీఎం, కాంగ్రెస్ నేత అశోక్ గెహ్లాట్ పేర్కొన్నారు.

Update: 2024-08-12 16:17 GMT

దిశ, నేషనల్ బ్యూరో : ఓ వైపు వర్ష బీభత్సానికి ప్రజలు ప్రాణాలను కోల్పోతుంటే.. మరోవైపు రాష్ట్రానికి విపత్తు నిర్వహణ శాఖ మంత్రి ఉన్నారా ? లేరా ? అనే దానిపై డైలమా నెలకొనడం దారుణమని రాజస్థాన్ మాజీ సీఎం, కాంగ్రెస్ నేత అశోక్ గెహ్లాట్ పేర్కొన్నారు. ఇలాంటి సందిగ్ధ పరిస్థితి నెలకొనడం అనేది రాష్ట్ర ప్రజలను మోసం చేయడంతో సమానమేనని ఆయన వ్యాఖ్యానించారు.

ఇంతకుముందు రాజస్థాన్ విపత్తు నిర్వహణ శాఖ మంత్రిగా బీజేపీ సీనియర్ నేత కిరోడి లాల్ మీనా వ్యవహరించేవారు. గత నెలలోనే ఆయన మంత్రి పదవికి రాజీనామా చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో దౌసా స్థానంలో బీజేపీ అభ్యర్థి ఓడిపోవడంతో మీనా ఈ నిర్ణయం తీసుకున్నారు. ‘‘ఇంతకీ కిరోడి లాల్ మీనా రాజీనామాను సీఎం ఆమోదించారా ? లేదా ? అనే దానిపై ఎవరికీ క్లారిటీ లేదు. దీనిపై ప్రజలకు స్పష్టత ఇవ్వాల్సిన బాధ్యత సీఎం భజన్‌లాల్ శర్మపై ఉంది’’ అని అశోక్ గెహ్లాట్ పేర్కొన్నారు.

Tags:    

Similar News