అవార్డు స్వీకరిస్తాం.. డబ్బు మాత్రం వద్దు: గీతా ప్రెస్ మేనేజర్ డాక్టర్ లాల్మణి తివారీ

గాంధీ శాంతి అవార్డును స్వీకరిస్తామని కానీ డబ్బు మాత్రం తీసుకోమని గీతా ప్రెస్ మేనేజర్ డాక్టర్ లాల్మణి తివారీ తెలిపారు.

Update: 2023-06-19 12:26 GMT

దిశ, వెబ్ డెస్క్: యూపీ గోరఖ్ పూర్ లోని గీత ప్రెస్ కు 2021 సంవత్సరానికి గాను గాంధీ శాంతి బహుమతి ప్రకటించింది కేంద్రప్రభుత్వం. అయితే దీనిపై బీజేపీ, కాంగ్రెస్ మధ్య రాజకీయ వివాదం చెలరేగింది. ప్రధాని మోడీ నేతృత్వంలోని జ్యూరీ తీసుకున్న ఈ అవార్డు నిర్ణయంపై కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ హిందూ భావాజాలానికి ముడిపెట్టారు. ఈ నేపథ్యంలోనే గీతా ప్రెస్ మేనేజర్ డాక్టర్ లాల్మణి తివారీ స్పందించారు.

తాము అవార్డును స్వీకరిస్తామని, కానీ అవార్డు కింద ఇచ్చే రూ.కోటి మాత్రం తీసుకోబోమని స్పష్టం చేశారు. ఇది తమ సంస్థ నిబంధనలకు విరుద్ధం అని ఆయన అన్నారు. కాగా ఈ విషయంపై స్పందించిన అసోం సీఎం హిమంత బిశ్వా కాంగ్రెస్ పై విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ పార్టీ భారత వారసత్వంపై దాడులు చేస్తోందని సంచలన వ్యాఖ్యలు చేశారు. 

Tags:    

Similar News