G20 సమ్మిట్: ఢిల్లీలో మూడు రోజుల లాక్‌డౌన్‌పై పోలీసుల క్లారిటీ..

జీ20 సదస్సు సందర్భంగా సెప్టెంబర్ 8 నుంచి 10 వరకు ఢిల్లీలో మూడు రోజులు లాక్ డౌన్ విధిస్తున్నట్లు వచ్చిన వార్తలను ఢిల్లీ పోలీసులు కొట్టిపారేశారు.

Update: 2023-09-01 11:24 GMT

న్యూఢిల్లీ : జీ20 సదస్సు సందర్భంగా సెప్టెంబర్ 8 నుంచి 10 వరకు ఢిల్లీలో మూడు రోజులు లాక్ డౌన్ విధిస్తున్నట్లు వచ్చిన వార్తలను ఢిల్లీ పోలీసులు కొట్టిపారేశారు. అవన్నీ పుకార్లేనని తేల్చి చెప్పారు. ప్రపంచ దేశాల అధినేతలు వస్తుండటం వల్ల ఆంక్షలు మాత్రమే విధించామని, లాక్‌డౌన్‌ పెట్టామన్న వార్తల్లో నిజం లేదని ఢిల్లీ పోలీస్ పీఆర్వో సుమన్ నల్వా స్పష్టం చేశారు. జీ20 సదస్సు జరిగే కొన్ని ప్రాంతాల పరిసరాల్లోని అన్ని దుకాణాలు, ఇతరత్రా కమర్షియల్ కాంప్లెక్స్‌ని మూడు రోజుల పాటు మూసివేస్తామని చెప్పారు.

ఆ ప్రాంతాల్లోకి వెళ్లాలంటే తప్పనిసరిగా ఐడీ కార్డ్‌లను చూపించాల్సిందేనన్నారు. నిత్యావసరాల పంపిణీపై ఎలాంటి ఆంక్షలు ఉండవని పేర్కొన్నారు. లాక్‌డౌన్‌ పుకార్లను నమ్మొద్దని ఆయన కోరారు. భద్రతా ఏర్పాట్లలో భాగంగా ఢిల్లీ పోలీసులు ప్రధాన వీధుల్లో ఏఐ (ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్) కెమెరాలను అమర్చారు. ఎవరైనా గోడలు ఎక్కడం, పరుగెత్తడం, వంగి నడవడం లాంటి సీన్‌లను చూస్తే ఈ కెమెరాలు అలారంను మోగించి భద్రతా దళాలను అలర్ట్ చేస్తాయి.


Similar News