జీ20లోకి ఆఫ్రికా యూనియన్‌!

జీ20 కూటమిలో ఆఫ్రికా యూనియన్‌కు సభ్యత్వం దక్కే అవకాశం ఉందని తెలుస్తోంది.

Update: 2023-09-08 10:37 GMT

న్యూఢిల్లీ : జీ20 కూటమిలో ఆఫ్రికా యూనియన్‌కు సభ్యత్వం దక్కే అవకాశం ఉందని తెలుస్తోంది. దీనిపై ఢిల్లీ వేదికగా జరిగిన జీ20 దేశాల షెర్పాల సమావేశంలో తాజాగా ఏకాభిప్రాయం కుదిరిందని జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. అయితే ఆఫ్రికా యూనియన్‌ చేరిక తర్వాత జీ20 గ్రూపు పేరును జీ21గా మారుస్తారా..? లేదా..? అనేది స్పష్టంగా తెలియలేదు. ఆఫ్రికా యూనియన్‌‌లో మొత్తం 55 దేశాలు ఉన్నాయి.

వాస్తవానికి ఆఫ్రికా యూనియన్‌కు జీ20 సభ్యత్వం కల్పించాలని అగ్రరాజ్యాలపై ఒత్తిడిని పెంచిన క్రెడిట్ భారత్‌కే దక్కాలి. అయితే రష్యా, చైనాలు కూడా ఈ క్రెడిట్‌ను క్లెయిమ్ చేసుకునేందుకు యత్నించే అవకాశం ఉందని పరిశీలకులు అంటున్నారు. ‘‘ఆఫ్రికా యూనియన్‌ చేరిక ప్రతిపాదనకు తొలుత మద్దతు ఇచ్చింది తామే’’ అని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి మావో నింగ్‌ ఇటీవల చేసిన కామెంట్‌ను అందుకు నిదర్శనంగా చూపిస్తున్నారు.


Similar News