మీడియాను చూసి.. పరుగులు పెట్టిన కోల్‌కతా హత్యాచార నిందితుడి ఫ్రెండ్
కోల్‌కతాలోని ఓ వైద్యకళాశాలలో ట్రైనీ వైద్యురాలి అత్యాచారం, హత్య సంఘటన యావత్ భారత దేశాన్ని కుదిపేసింది.
దిశ, వెబ్ డెస్క్: కోల్‌కతాలోని ఓ వైద్యకళాశాలలో ట్రైనీ వైద్యురాలి అత్యాచారం, హత్య సంఘటన యావత్ భారత దేశాన్ని కుదిపేసింది. ఈ కేసుకు సంబంధించి నిందితుడిని, అతనికి సహకరించిన వారిని కఠినంగా శిక్షించాలని దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. మీడియాను చూసి.. కోల్‌కతా హత్యాచార నిందితుడి ఫ్రెండ్ పరుగులు పెట్టిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అత్యాచార నిందితుడు సంజయ్ రాయ్ సన్నిహితుడిని CBI స్పెషల్ బ్రాంచ్ విచారిస్తోంది. ఈ క్రమంలో అతను సీబీఐ ఆఫీస్ కు చేరుకోగానే అక్కడే ఉన్న మీడియా ప్రతినిధులు.. కేసు గురించి అతడిని ప్రశ్నించారు. దీంతో ఒక్కసారిగా అతను ఆఫీస్ లోకి పరుగులు పెట్టాడు. అడ్డు వచ్చిన వారిని తోసుకుంటే వేగంగా భద్రతా సిబ్బందిని నెట్టుకుంటూ సీబీఐ ఆఫీసులోకి వెళ్లిపోయాడు. దీనికి సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.