Road Accident: యూపీలోని ఇటావాలో ఘోర రోడ్డు ప్రమాదం నలుగురు మృతి

దేశంలోనే అతి పెద్ద రాష్ట్రం అయిన యూపీలో ప్రతి రోజు ఏదో ఒక మూలకు రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి.

Update: 2024-08-21 06:44 GMT

దిశ, వెబ్ డెస్క్: దేశంలోనే అతి పెద్ద రాష్ట్రం అయిన యూపీలో ప్రతి రోజు ఏదో ఒక మూలకు రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రంలో నిత్య రోడ్డు ప్రమాదాలు.. పదుల సంఖ్యలో ప్రజల ప్రాణాలు తీస్తున్నాయి. ఈ క్రమంలోనే బుధవారం ఉదయం 10 గంటల ప్రాంతంలో ఇటావా జిల్లాలో మరో ప్రమాదం చోటు చేసుకుంది. వేగంగా వెళ్తున్న ట్రక్కు కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.


Similar News