‘గ్రేట్ సార్’.. మరోసారి మనస్సులు గెల్చుకున్న మాజీ CM నవీన్ పట్నాయక్

ఒడిషా నూతన ముఖ్యమంత్రిగా మోహన్ చరణ్ మాఝీ ప్రమాణ స్వీకారం చేశారు. బుధవారం రాజ్ భవన్‌లో గవర్నర్ రఘుబర్ దాస్ మోహన్ మాఝీ

Update: 2024-06-12 14:53 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఒడిషా నూతన ముఖ్యమంత్రిగా మోహన్ చరణ్ మాఝీ ప్రమాణ స్వీకారం చేశారు. బుధవారం రాజ్ భవన్‌లో గవర్నర్ రఘుబర్ దాస్ మోహన్ మాఝీ చేత సీఎంగా ప్రమాణ స్వీకారం చేయించారు. ఫస్ట్ టైమ్ ఒడిషాలో అధికారం కైవసం చేసుకోవడంతో ఈ వేడుకను బీజేపీ ప్రతిష్టాత్మంగా నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్రమంత్రి రా‌జ్‌నాథ్ సింగ్, ఇతర బీజేపీ ప్రముఖులు హాజరయ్యారు. అయితే, మోహన్ మాఝీ ప్రమాణ స్వీకారోత్స కార్యక్రమంలో బిజు జనతాదళ్ చీఫ్, ఆ రాష్ట మాజీ సీఎం నవీన్ పట్నాయక్ సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్‌గా నిలిచారు.

ఇటీవల జరిగిన ఒడిషా అసెంబ్లీ ఎన్నికల్లో నవీన్ పట్నాయక్ నేతృత్వంలోని బిజు జనతాదళ్ పార్టీ ఓటమి పాలైన విషయం తెలిసిందే. వరుసగా మూడు పర్యాయాలు విజయం సాధించిన బిజు జనతాదళ్‌ను ఈ సారి బీజేపీ ఓడించి అధికారాన్ని చేజిక్కించుకుంది. దీంతో గత 15 సంవత్సరాలుగా ఒడిషా సీఎంగా కొనసాగుతోన్న నవీన్ పట్నాయక్ పదవి కోల్పోవాల్సి వచ్చింది. అంతేకాకుండా నవీన్ పట్నాయక్ టార్గెట్‌గా బీజేపీ అగ్రనేతలు ఎన్నికలు ప్రచారంలో విమర్శలు గుప్పించారు. అయితే, ఎన్నికల్లో ఓటమి, బీజేపీ నేతలు తనను విమర్శించిన వాటిని మనసులో పెట్టుకోకుండా బీజేపీ ఆహ్వానించగానే మోహన్ మాఝీ ప్రమాణ స్వీకారోత్స కార్యక్రమానికి నవీన్ పట్నాయక్ హాజరయ్యారు.

ఈ కార్యక్రమంలో హుషారుగా కనిపించిన నవీన్ పట్నాయక్ పలువురు బీజేపీ నేతలతో సరదాగా గడిపారు. దీంతో బీజేపీ నేతల కంటే నవీన్ పట్నాయకే ఈ ప్రోగామ్‌లో ఎక్కువగా హైలెట్ అయ్యారు. మృదుస్వభావి అని పేరున్న నవీన్ పట్నాయక్ తనను అలా అనడానికి కారణమేంటో మరోసారి నిరూపించకున్నారు. బీజేపీ నేతల విమర్శలను, పార్టీ ఓటమిని మనసులో పెట్టుకోకుండా సీఎం ప్రమాణ స్వీకారోత్స కార్యక్రమానికి హాజరై నవీన్ పట్నాయక్ మరోసారి తన మంచితనాన్ని నిరూపించుకున్నారు. దీంతో నవీన్ పట్నాయక్ తీరుపై నెట్టింట్లో సర్వత్రా ప్రశంసలు వ్యక్తం అవుతున్నాయి. ‘‘ఎన్నికల్లో ఓడిన మీ ప్రవర్తనతో మరోసారి మనసులు గెల్చుకున్నారు సార్’’ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. 


Similar News