Forest Funds: అటవీ శాఖ నిధులతో ఐఫోన్ల కొనుగోలు.. కాగ్ నివేదికలో వెల్లడి

ఉత్తరాఖండ్‌లో అటవీ శాఖకు కేటాయించిన నిధులను అధికారులు దుర్వినియోగం చేశారు.

Update: 2025-02-22 13:36 GMT
Forest Funds: అటవీ శాఖ నిధులతో ఐఫోన్ల కొనుగోలు.. కాగ్ నివేదికలో వెల్లడి
  • whatsapp icon

దిశ, నేషనల్ బ్యూరో: ఉత్తరాఖండ్‌ (Utharakhand) లో అటవీ శాఖకు కేటాయించిన నిధులను అధికారులు దుర్వినియోగం చేశారు. పచ్చని చెట్లను పెంచి అడవులను కాపాడటానికి వెచ్చించిన ఫండ్స్ తో ఐఫోన్లు, ల్యాప్ టాప్‌లు, రిఫ్రిజిరేటర్లు, కూలర్లు కొనుగోలు చేశారు. అంతేగాక ఇతర ఆఫీస్ స్టేషనరీని సైతం కొన్నారు. కంప్ట్రోలర్ ఆడిటర్ జనరల్ (CAG) నివేదికలో ఈ విషయం వెల్లడైంది. 2019- 2022 మధ్య కాంపెన్సేటరీ అఫారెస్టేషన్ ఫండ్ మేనేజ్‌మెంట్ అండ్ ప్లానింగ్ అథారిటీ (Campa) కేటాయించిన నిధుల్లో రూ.13.9 కోట్లను అటవీ సుందరీకరణకు బదులుగా అనవసరమైన వాటిపై ఖర్చు చేశారని కాగ్ తెలిపింది.

అలాగే జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ (JICA) ప్రాజెక్టుకు పన్ను చెల్లింపుల కోసం రూ.56.97 లక్షలు మళ్లించారని, అల్మోరా అటవీ కార్యాలయంలో సోలార్ ఫెన్సింగ్‌కు రూ.13.51 లక్షలు, అవగాహన ప్రచారాల నిమిత్తం రూ.6.54 లక్షలను చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ (CCF), విజిలెన్స్, లీగల్ సెల్ కార్యాలయాన్ని ఏర్పాటు చేయడానికి ఉపయోగించారని కూడా పేర్కొంది. కార్యాలయ సామాగ్రి కొనుగోలుకు సైతం డివిజనల్ స్థాయిలో నిధులు దుర్వినియోగం అయ్యాయని నివేదిక పేర్కొంది. కాగ్ రిపోర్టఉ నేపథ్యంలో ఉత్తరాఖండ్ అటవీ మంత్రి సుబోధ్ ఉనియల్ తన శాఖకు సంబంధించిన ఈ విషయంపై దర్యాప్తునకు ఆదేశించారు.

Tags:    

Similar News