Independence Day: ఆ 13 జిల్లాల్లో తొలిసారిగా రెపరెపలాడిన త్రివర్ణపతాకం

ఛత్తీస్ గఢ్ లోని మావోయిస్టుల ప్రభావిత 13 గ్రామాల్లో తొలిసారిగా జాతీయ జెండాను ఎగురవేసినట్లు అధికారులు తెలిపారు. బస్తర్ ప్రాంతంలోని 13 గ్రామాల్లో ఇప్పటివరకు జాతీయజెండాను ఎగురవేయలేదు.

Update: 2024-08-15 08:18 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ఛత్తీస్ గఢ్ లోని మావోయిస్టుల ప్రభావిత 13 గ్రామాల్లో తొలిసారిగా జాతీయ జెండాను ఎగురవేసినట్లు అధికారులు తెలిపారు. బస్తర్ ప్రాంతంలోని 13 గ్రామాల్లో ఇప్పటివరకు జాతీయజెండాను ఎగురవేయలేదు. తొలిసారిగా పంద్రాగస్టు రోజున జెండాను ఎగురవేసినట్లు పోలీసులు తెలిపారు. గత ఏడు నెలల్లో ఈ గ్రామాల్లో కొత్తగా భద్రతాదళాల క్యాంపులను ఏర్పాటు చేయడంతో ఆయా ప్రాంతాల అభివృద్ధికి బాటలు వేస్తున్నట్లు తెలిపారు. నెర్‌ఘాట్ (దంతెవాడ జిల్లా), పానిదోబిర్ (కంకేర్), గుండం, పుట్‌కేల్, చుత్వాహి (బీజాపూర్), కస్తూర్‌మెట్ట, మస్పూర్, ఇరాక్‌భట్టి, మొహంది (నారాయణపూర్), టేకలగూడెం, పువర్తి, లఖపాల్, పూలన్‌పాడ్ (సుక్మా) గ్రామాల్లో తొలిసారిగా త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసినట్లు బస్తర్ రీజియన్ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ పీ సుందర్‌రాజ్ పేర్కొన్నారు.

శాంతియుత బస్తర్ కోసమే..

గతేడాది గణతంత్ర దినోత్సవం తర్వాత మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో భద్రతా శిబిరాలను ఏర్పాటు చేసినట్లు పోలీసులు తెలిపారు. క్యాంపుల ఏర్పాటు తర్వాత ఈ ప్రాంతానికి కొత్తగా గుర్తింపు వచ్చిందన్నారు. శాంతియుత, సంపన్నమైన బస్తర్ ని నిర్మించేందుకు ఈ శిబిరాలు ఉపయోగపడతాయన్నారు. ఛత్తీస్ గఢ్ రాజధాని రాయ్‌పూర్‌తో సహా అన్ని జిల్లాల్లోనూ భారీగా బందోబస్తుగా ఏర్పాటు చేశామన్నారు.


Similar News