Fake Videos : మోడీ, యోగి, గాంధీజీ డ్యాన్స్ చేస్తున్నట్లుగా ఫేక్ వీడియోలు.. కేసు నమోదు

దిశ, నేషనల్ బ్యూరో : భోజ్‌పురి సాంగ్స్‌కు జాతిపిత మహాత్మాగాంధీ, ప్రధానమంత్రి నరేంద్రమోడీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌లు డ్యాన్స్ చేస్తున్నట్లుగా ఫేక్ వీడియోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన వ్యవహారంపై పోలీసులు స్పందించారు.

Update: 2024-09-25 12:54 GMT

దిశ, నేషనల్ బ్యూరో : భోజ్‌పురి సాంగ్స్‌కు జాతిపిత మహాత్మాగాంధీ, ప్రధానమంత్రి నరేంద్రమోడీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌లు డ్యాన్స్ చేస్తున్నట్లుగా ఫేక్ వీడియోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన వ్యవహారంపై పోలీసులు స్పందించారు. నేహా సింగ్ రాథోడ్ అనే ‘ఎక్స్’’ యూజర్ ఈ వీడియోల వ్యవహారాన్ని వెలుగులోకి తెచ్చారు. ‘‘ఇలాంటి వీడియోలను ఎందుకు క్రియేట్ చేస్తున్నారు ? వీటిని వైరల్ చేస్తున్న వారి ఉద్దేశం ఏమిటి ?’’ అని ఆమె తన ఎక్స్ పోస్ట్‌లో ప్రశ్నలు గుప్పించారు.

‘‘మహిళల సాధికారత కోసం సీఎం యోగి ఎంతో కృషి చేశారు. అలాంటి నాయకుడిపై ఫేక్ వీడియోలను క్రియేట్ చేయడం దారుణం. కొన్ని వ్యూస్ కోసం పాకులాడే వ్యక్తులే ఈ ఫేక్ వీడియోలను క్రియేట్ చేశారు’’ అని నేహా సింగ్ విమర్శించారు. దీనిపై స్పందించిన యూపీలోని బలియా పట్టణ పోలీసులు గుర్తుతెలియని వ్యక్తులు అభ్యంతరకర వీడియోలను క్రియేట్ చేస్తున్నారనే అభియోగాలతో కేసును నమోదు చేశారు. నిందితులను గుర్తించి సైబర్ చట్టాల కింద చర్యలు తీసుకుంటామని పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు.


Similar News