వేగం పెంచిన ఈడీ.. మరో మాజీ సీఎంపై కేసు

దిశ, నేషనల్ బ్యూరో : లోక్‌సభ ఎన్నికల వేళ కేంద్ర దర్యాప్తు సంస్థలు తమ పనిని వేగవంతం చేశాయి.

Update: 2024-03-17 11:34 GMT

దిశ, నేషనల్ బ్యూరో : లోక్‌సభ ఎన్నికల వేళ కేంద్ర దర్యాప్తు సంస్థలు తమ పనిని వేగవంతం చేశాయి. ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడటానికి సరిగ్గా ఒకరోజు ముందు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్టు చేసింది. తాజాగా ఛత్తీస్‌గఢ్‌లో కీలక పరిణామం చోటుచేసుకుంది. మహదేవ్ ఆన్‌లైన్ బెట్టింగ్ స్కామ్‌లో దాదాపు ఏడాది పాటు విచారణ నిర్వహించిన ఈడీ ఇటీవల ఛత్తీస్‌గఢ్‌‌లోని ఆర్థిక నేరాల విభాగం (ఈఓడబ్ల్యూ)కు నివేదికను సమర్పించింది. దాని ఆధారంగా మాజీ ముఖ్యమంత్రి భూపేష్ బఘెల్ సహా పలువురిపై మార్చి 4న కేసు నమోదు చేశారు. ఈవిషయాన్ని సంబంధిత అధికారులు ఆదివారం వెల్లడించారు. మాజీ సీఎం బఘేల్‌తో పాటు యాప్ ప్రమోటర్లు రవి ఉప్పల్, సౌరభ్ చంద్రకర్, శుభమ్ సోనీ, అనిల్ కుమార్ అగర్వాల్‌తో పాటు మరో 14 మందిని ఎఫ్‌ఐఆర్‌లో నిందితులుగా చేర్చినట్లు తెలిపారు. రూ.6వేల కోట్లు విలువైన మహదేవ్ ఆన్‌లైన్ బెట్టింగ్ స్కామ్‌లో ఛత్తీస్‌గఢ్‌‌కు చెందిన పలువురు రాజకీయ నాయకులు, బ్యూరోక్రాట్ల ప్రమేయం ఉందని తమ దర్యాప్తులో తేలిందని గతంలో ఈడీ తెలిపింది.

Tags:    

Similar News