Boat Accident : ముంబయి తీరంలో ఫెర్రీ బోల్తా

ముంబయి(Mumbai) తీరంలో ఫెర్రీ బోల్తా(Ferry Accident) పడింది.

Update: 2024-12-18 13:31 GMT

దిశ, వెబ్ డెస్క్ : ముంబయి(Mumbai) తీరంలో ఫెర్రీ బోల్తా(Ferry Accident) పడింది. పర్యాటకులతో కూడిన ఫెర్రీ 'గేట్ వే ఆఫ్ ఇండియా'(Gate Way Of India) నుంచి ఎలిఫెంటా కేవ్స్(Elefenta Caves) కు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 13 మంది సముద్రంలో గల్లంతయారు. తక్షణమే స్పందించిన రెస్క్యూటీం ప్రమాద స్థలానికి చేరుకొని సముద్రంలో మునిగి పోతున్న 75 మందిని రక్షించారు. 80 మంది పర్యాటకులతో ఎలిఫెంటా గుహలకు వెళుతున్న ఫెర్రీని స్పీడ్ బోట్ వేగంగా వచ్చి ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. కాగా ఈ సంఘటనలో ఇద్దరు మృతి చెందినట్టు అధికారులు వెల్లడించారు. మరో 13 మంది కోసం పోర్ట్ అధికారులు, కోస్ట్ గార్డ్, మత్స్యకారుల సహాయంతో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని తెలియ జేశారు.    

Tags:    

Similar News