లోక్‌పాల్ ఛైర్‌పర్సన్‌గా ప్రమాణం చేసిన ఏఎం ఖాన్విల్కర్

దిశ, నేషనల్ బ్యూరో : లోక్‌పాల్ ఛైర్‌పర్సన్‌గా గత నెలలోనే నియమితులైన సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి అజయ్ మాణిక్‌రావ్ ఖాన్విల్కర్ ఆదివారం సాయంత్రం ప్రమాణ స్వీకారం చేశారు.

Update: 2024-03-10 15:49 GMT

దిశ, నేషనల్ బ్యూరో : లోక్‌పాల్ ఛైర్‌పర్సన్‌గా గత నెలలోనే నియమితులైన సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి అజయ్ మాణిక్‌రావ్ ఖాన్విల్కర్ ఆదివారం సాయంత్రం ప్రమాణ స్వీకారం చేశారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో ఆయనతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పదవీ ప్రమాణం చేయించారు. 66 ఏళ్ల ఖాన్విల్కర్ 2016 మే 13 నుంచి 2022 జూలై 29 వరకు సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేశారు. గతంలో లోక్‌పాల్ ఛైర్‌పర్సన్‌గా వ్యవహరించిన పినాకి చంద్ర ఘోష్ 2022 మే 27న పదవీ విరమణ చేశారు. దీంతో దాదాపు రెండేళ్ల గ్యాప్ తర్వాత మళ్లీ ఆ పదవిని కేంద్ర ప్రభుత్వం భర్తీ చేసింది.

Tags:    

Similar News