మాజీ అగ్నివీర్‌లకు రిజర్వేషన్, వయస్సు సడలింపు: సీఐఎస్ఎఫ్, బీఎస్ఎఫ్

ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్‌ నుంచి మినహాయింపు ఉంటుందని పేర్కొన్నారు.

Update: 2024-07-11 15:15 GMT

దిశ, నేషనల్ బ్యూరో: మాజీ అగ్నివీర్‌లకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ శుభవార్త చెప్పింది. వారికోసం సీఐఎస్ఎఫ్, బీఎస్ఎఫ్ కానిస్టేబుల్ పోస్టుల్లో 10 శాతం వారికోసం రిజర్వ్ చేయనున్నట్టు వెల్లడించింది. ఈ మేరకు సీఐఎస్‌ఎఫ్ డీజీ నీనా సింగ్ గురువారం ప్రకటనలో తెలిపారు. అంతేకాకుండా ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్‌ నుంచి మినహాయింపు ఉంటుందని పేర్కొన్నారు. మాజీ అగ్నీవీర్‌ల నియామకానికి సంబంధించి హోం మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. దీని ప్రకారం, 'సీఐఎస్ఎఫ్ కూడా మాజీ అగ్నివీర్‌ల నియామక ప్రక్రియను సిద్ధం చేస్తోంది. ఫిజికల్ టెస్టుల్లో కూడా సడలింపు ఉంటుంది. మాజీ అంగివీర్‌లు దీన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. మాజీ అగ్నిమాపక సిబ్బందికి సైతం వయోపరిమితిలో సడలింపు ఉంటుందని' నీనా సింగ్ స్పష్టం చేశారు. శిక్షణ కలిగిన, సమర్థవంతమైన అగ్నివీర్‌లను తీసుకోవడం వల్ల సీఐఎస్ఎఫ్ మరింత శక్తివంతమవుతుంది. దీనివల్ల సీఐఎస్ఎఫ్ బలగాల్లో క్రమశిక్షణ పెరుగుతుంది. అదేవిధంగా బీఎస్ఎఫ్‌కు సైతం సైనికులను సిద్ధం చేస్తున్నట్టు బీఎస్ఎఫ్ డీజీ నితిన్ అగర్వాల్ చెప్పారు. అగ్నిమాపక సిబ్బంది రిక్రూట్‌మెంట్‌లో 10 శాతం రిజర్వేసన్ వల్ల ప్రయోజనాలు ఉన్నాయని నితిన్ అగర్వాల్ వెల్లడించారు. అగ్నివీర్‌లు సైన్యంలో ఉన్న సమయంలోనే క్రమశిక్షణ నేర్చుకుంటారు. మొదటి బ్యాచ్ అగ్నివీర్‌లకు ఐదేళ్ల సడలింపు ఉంటుందని నీనా సింగ్ పేర్కొన్నారు. మాజీ అగ్నివీర్‌లను నియమించడం ద్వారా అన్ని భద్రతా దళాలకు ప్రయోజనం చేకూరుతుందని ఆయన అన్నారు.


Similar News