Male Partner: స్వలింగ సంపర్కుడి హత్య.. 14 ఏళ్ల తర్వాత అరెస్ట్

మనీష్ హత్య (Murder)కు సంబంధించి అతని స్నేహితుల్లో ఒకరైన హీరాసింగ్ జూన్ 29, 2010న అహ్మదాబాద్‌లోని వేజల్‌పూర్ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.

Update: 2024-10-27 02:37 GMT

దిశ, వెబ్ డెస్క్: స్వలింగ సంపర్కం.. నేటికాలంలో ఇది షరా మామూలుగా మారింది. 14 ఏళ్ల క్రితం స్వలింగ సంపర్క భాగస్వామిని చంపిన కేసులో నిందితుడిని తాజాగా అరెస్ట్ చేశారు అహ్మదాబాద్ (Ahmedabad) క్రైమ్ బ్రాంచ్ పోలీసులు. అహ్మదాబాద్ లోని వెజల్ పూర్ నివాసి అయిన రమేష్ దేశాయ్.. తన స్నేహితుడు మనీష్ గుప్తాను హత్య చేసి.. నోటిలో ఒక ద్రావణం పోసి.. మృతదేహాన్ని దుప్పటిలో చుట్టి.. తన ఇంటిలోని వంటగదిలో పాతిపెట్టినట్లు పోలీసులు తెలిపారు. తన స్వలింగ సంపర్క పార్ట్నర్ అయిన మనీష్ తో గొడవ జరగడంతో అతడిని హత్య చేసి పారిపోయినట్లు నిందితుడు విచారణలో అంగీకరించినట్లు పేర్కొన్నారు.

మనీష్ హత్య (Murder)కు సంబంధించి అతని స్నేహితుల్లో ఒకరైన హీరాసింగ్ జూన్ 29, 2010న అహ్మదాబాద్‌లోని వేజల్‌పూర్ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జూన్ 26, 2010 మధ్యాహ్నం 3 గంటల సమయంలో రమేష్ దేశాయ్, మనీష్ గుప్తా గదిలో ఉన్నారు. మనీష్ తనను అసభ్యంగా తాకుతూ.. ప్రైవేట్ భాగాల్లో కొరికాడని.. తనకు తీవ్ర రక్తస్రావం అయిందని రమేష్ తెలిపాడు. ఆ తర్వాత ఇద్దరి మధ్యన గొడవ జరగ్గా.. రమేష్ ఆవేశంతో ఇటుకతో మనీష్ తలపై కొట్టాడు. స్పృహ కోల్పోవడంతో మనీష్ చనిపోయాడని భావించి వంటగదిలో పూడ్చిపెట్టాడు. వారితో కలిసి ఉంటున్న హరిసింగ్.. మనీష్ కనిపించకపోవడంతో రమేష్ ను అడిగాడు. బయటకు వెళ్లాడని చెప్పడంతో ఊరుకున్నాడు.

తర్వాతిరోజు కిచెన్ లో రక్తపు మరకలు కనిపించడంతో.. హరిసింగ్ ఆ విషయం గురించి రమేష్ ను ప్రశ్నించాడు. అది గుట్కా నమిలి ఉమ్మినది అని చెప్పాడు. తర్వాత ఆ మరకల్ని క్లీన్ చేశాడు. మూడోరోజున మనీష్ డెడ్ బాడీ నుంచి దుర్వాసన రావడంతో ఇంటి యజమాని, హరిసింగ్ కు ఎక్కడ దొరికిపోతానోనని రమేష్ అక్కడి నుంచి పరారయ్యాడు. అలా 14 సంవత్సరాలుగా పోలీసుల నుంచి తప్పించుకుని తిరుగుతున్నాడు.

అహ్మదాబాద్ క్రైమ్ బ్రాంచ్ లో పెండింగ్ లో ఉన్న కేసుల్ని డీసీపీ అజిత్ రాజియన్ పరిశీలించగా.. ఈ కేసుపై మళ్లీ విచారణ ప్రారంభించారు. రమేష్ పరారీలో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు.. అతని కదలికలపై నిఘా పెట్టారు. రాజస్థాన్ వెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నట్లు నిఘా వర్గాల నుంచి సమాచారం అందడంతో.. పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు.

Tags:    

Similar News