దిలీప్ ఘోష్, సుప్రియా శ్రీనాథే లపై ఫైర్ అయిన ఈసీ..!
బీజేపీ ఎంపీ దిలీప్ ఘోష్, కాంగ్రెస్ నాయకురాలు సుప్రియా శ్రీనాథేలపై పైర్ అయ్యింది ఎన్నికల సంఘం. బెంగాల్ సీఎం మమతా బెనర్జీని కించపరిచేలా దిలీప్ ఘోష్ వ్యాఖ్యలు చేశారు.
దిశ, నేషనల్ బ్యూరో: బీజేపీ ఎంపీ దిలీప్ ఘోష్, కాంగ్రెస్ నాయకురాలు సుప్రియా శ్రీనాథేలపై పైర్ అయ్యింది ఎన్నికల సంఘం. బెంగాల్ సీఎం మమతా బెనర్జీని కించపరిచేలా దిలీప్ ఘోష్ వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ నేత సుప్రియా శ్రీనాథే కంగనా రనౌత్ పరువుకు భంగం కలిగేలా కామెంట్స్ చేశారు. ఇరువులు నేతలు చేసిన వ్యాఖ్యలపై ఈసీ స్పందించింది. ఇకపోతే ఈసీ పంపిన నోటీసులకు దిలీప్ ఘోష్, సుప్రియా శ్రీనాథే సమాధానాలు పంపారు. వాటిని స్వీకరించిన తర్వాతే ఇద్దరికి చీవాట్లు పెట్టింది.
ఎన్నికల కోడ్ ముగిసే వరకు తాము మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని ఇద్దరినీ ఈసీ హెచ్చరించింది. దిలీప్ ఘోష్, సుప్రియా శ్రీనాథేకు సంబంధించిన వ్యవహారాలను ఇప్పటినుంచి ప్రత్యేక్షంగా పరిశీలిస్తామని పేర్కొంది. మళ్లీ తప్పుచేస్తే.. కఠిన చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చింది.
మమతాపై బీజేపీ ఎంపీ దిలీప్ ఘోష్, కంగనా రనౌత్‌పై కాంగ్రెస్ నాయకురాలు సుప్రియా శ్రీనాథే కించపరిచే వ్యాఖ్యలు చేయడంతో ఆ విషయం ఈసీ దాకా వెళ్లింది. వ్యక్తిగతంగా విమర్శనలు చేసి ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని నోటీసులు పంపింది. అందుకు వారిచ్చిన సమాధానాలతో సంతృప్తి చెందని ఈసీ.. ఇద్దరిపై ఫైర్ అయ్యింది.
Read More..
ప్రధానికి ఇష్టమైన టిఫిన్ ఏంటో తెలుసా? ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు