UNFPA India: 2050 నాటికి దేశంలో రెట్టింపు స్థాయికి వృద్ధుల జనాభా

2050 నాటికి 60 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయసున్న వ్యక్తులు 34.60 కోట్లతో రెట్టింపు కానుంది.

Update: 2024-07-21 10:15 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ప్రపంచంలోనే అత్యధికంగా యువత కలిగిన భారత్‌లో 2050 నాటికి వృద్ధుల జనాభా రెట్టింపు అవుతుందని యూఎన్ఎఫ్‌పీఏ ఇండియా చీఫ్ ఆండ్రియా వోజ్‌నర్ అన్నారు. ముఖ్యంగా ఒంటరిగా జీవించే, పేదరికాన్ని ఎదుర్కొనే అవకాశం ఉన్న వృద్ధ మహిళలకు ఆరోగ్య సంరక్షణ, గృహాలు, పెన్షన్‌లలో పెట్టుబడులు పెరగాల్సిన అవసరం ఉందని ఆమె అభిప్రాయపడ్డారు. పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆమె.. స్థిరమైన అభివృద్ధిని వేగవంతం చేసేందుకు భారత ప్రభుత్వం అనుసరిస్తున్న కీలక అంశాలను ప్రస్తావించారు. వాటిలో యువ జనాభా, వృద్ధులు, పట్టణీకరణ, వలసలు ఇలా అన్నిట్లోనూ కేంద్రం ప్రత్యేకమైన సవాళ్లు, అవకాశాలను కలిగి ఉంది. 2050 నాటికి 60 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయసున్న వ్యక్తులు 34.60 కోట్లతో రెట్టింపు కానుంది. దీన్ని పరిగణలోకి తీసుకుని ప్రభుత్వం కీలక పథకాల్లో పెట్టుబడులను పెంచాలి. అది కూడా ఒంటరిగా జివించే వారికి, పేదరికాన్ని ఎదుర్కొనే వారికి పథకాలు చేరువ కావాలన్నారు. ఇదే సమయంలో భారత్ 25.2 కోట్ల మంది 10-19 ఏళ్ల మధ్య వయసున్న జనాభా ఉన్నారని ఆండ్రియా వోజ్‌నర్ చెప్పారు. వివిధ పథకాల్లో పెట్టుబడులతో పాటు లింగ సమానత్వాన్ని ప్రోత్సహించడం ద్వారా స్థిరమైన పురోగతి వైపు వెళ్లేందుకు వీలవుతుందని ఆమె అన్నారు. అలాగే, 2050 నాటికి భారత్ 50 శాతం పట్టణాలు ఉండొచ్చని అంచనా. మురికివాడల పెరుగుదల, వాయు కాలుష్యం, పర్యావరణ సమస్యలను నివారించేందుకు స్మార్ట్ సిటీలు, మెరుగైన మౌలిక సదుపాయాలు, సరసమైన ఇళ్లను నిర్మించడం కీలకమని ఆమె వెల్లడించారు.

Tags:    

Similar News