సముద్రంలో మునిగిన చమురు నౌక.. 8 మంది భారతీయులు సేఫ్

దిశ, నేషనల్ బ్యూరో : ఒమన్‌ సముద్ర తీరంలో చమురు నౌక మునిగిపోయి.. అందులోని భారత సిబ్బంది గల్లంతయ్యారనే వార్త తెలిసిన వెంటనే భారత నౌకాదళం అప్రమత్తమైంది.

Update: 2024-07-17 18:41 GMT

దిశ, నేషనల్ బ్యూరో : ఒమన్‌ సముద్ర తీరంలో చమురు నౌక మునిగిపోయి.. అందులోని భారత సిబ్బంది గల్లంతయ్యారనే వార్త తెలిసిన వెంటనే భారత నౌకాదళం అప్రమత్తమైంది. ఒమన్ కోస్ట్ గార్డ్ దళంతో కలిసి భారత నౌకాదళం నిర్వహించిన సెర్చ్ ఆపరేషన్ సక్సెస్ అయింది. నౌక మునిగిపోవడంతో గల్లంతైన 16 మందిలో 9 మందిని రక్షించారు. వీరిలో 8 మంది భారతీయులు, ఒక శ్రీలంక వాస్తవ్యుడు ఉన్నారు. మరో ఐదుగురు భారతీయులు, ఇద్దరు శ్రీలంకన్ల ఆచూకీ కోసం రెస్క్యూ టీమ్స్ గాలిస్తున్నాయి. కొమొరోస్‌ జెండాతో యెమన్‌లోని ఎడెన్ వైపుగా వెళ్తున్న ఎమ్‌టీ ఫాల్కాన్‌ ప్రెస్టీజ్‌ ఓడ ఒమన్ తీరంలోకి ప్రవేశించాక సముద్రంలో మునిగిపోయింది. నౌకలోని భారతీయ సిబ్బందికి సహాయ సహకారాలను అందించే విషయంలో ఒమన్ అధికారులతో అక్కడి భారత రాయబార కార్యాలయం సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం.


Similar News