మోడీ పర్యటన ఖర్చు లెక్కల్లేవ్.. ఆ సంస్థకు కేంద్రం షాకింగ్ ఆన్సర్

సభలు, సమావేశాలంటూ నాయకులు దేశాల పర్యటనలు చేస్తుంటారు.. ఏ దేశానికి ఏ సమావేశానికి వెళతారో తెలియదు..

Update: 2022-09-21 13:08 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: సభలు, సమావేశాలంటూ నాయకులు దేశాల పర్యటనలు చేస్తుంటారు.. ఏ దేశానికి ఏ సమావేశానికి వెళతారో తెలియదు.. కానీ, పర్యటనకు వెళ్లిన ప్రతిసారి కోట్లాది రూపాయలు ఖర్చవుతుంది. ఆ డబ్బంతా ప్రజలు కట్టిన పన్నుల డబ్బే.. అసలు ఏ నాయకుడు ఎక్కడికి పర్యటిస్తున్నాడు? ఎంత ఖర్చు అవుతోందని తెలుసుకొని ప్రయత్నం చేయగా సరైన సమాధానం మాత్రం రాలేదని యూత్ ఫర్ యాంటీ కరప్షన్ సంస్థ ఫౌండర్ రాజేంద్ర అన్నారు. భారత ప్రధానిగా నరేంద్ర మోడీ పదవీ బాధ్యతలు చేపట్టిన నుంచి ఇప్పటివరకు ఎన్ని దేశాల పర్యటన చేశారు? అందుకు ఎంత ఖర్చు చేశారు? దానికి సంబంధించిన పర్యటన వివరాలు, ఖర్చుల వివరాలు ఇవ్వాలని ప్రధానమంత్రి కార్యాలయానికి యూత్ ఫర్ యాంటీ కరప్షన్ నుంచి దరఖాస్తు చేసింది. మోడీ ప్రధానమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఇప్పటి వరకు పలు దేశాలలో పర్యటించారు. పర్యటన వివరాలు, వాటి ఖర్చుల వివరాలు పీఎంవో వెబ్ సైట్‌లో ఉన్నాయని ప్రధానమంత్రి కార్యాలయ పీఐవో సమాధానం ఇచ్చింది. నిజానికి ఆ వెబ్ సైట్‌లో సరైన సమాధానమే లేదు. ఇప్పటి వరకు ప్రధాని మోడీ 66 దేశాలకు వెళ్లినట్టు వెబ్ సైట్‌లో ఉంది. కానీ, ఆ దేశాల పర్యటనకు సంబంధించిన ఖర్చుల వివరాలను మాత్రం పొందపర్చలేదు. దేశాన్ని పాలించే ప్రధానమంత్రి వెబ్ సైట్‌లో ఆయన పర్యటన ఖర్చుల వివరాలు పెట్టకపోవడం మాత్రం చాలా ఆశ్చర్యంగా ఉంది. పరిపాలనలో పారదర్శకత కోసం పనిచేస్తున్నామని చెపుతున్న ప్రభుత్వం తమ కార్యాలయంలో వెబ్ సైట్లపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందిన్నారు.

Tags:    

Similar News